అభినయము
అను.
మేడలు మిద్దెలు మెండు గలిగిననేమి
ఈడైన విభునితో - నెనసి యుండకపోతే. ఆ.
అతివ మిక్కిలి రూప - వతియైతేనేమి
సతతము పతిభక్తి - సలిపితేనేమి,
అతులిత వ్రతములు - ఆచరించిన నేమి
పతితోడ హితవుగా పలుకు లేకపోతే ॥
(2) వరకీయ ః భర్త యున్నను పర పురుషులయందనురాగము గల్గినట్టి నాయిక.
ఉదా : ప.
అత్తవా రూరికి అంపేరు మావారు
అయ్యయో ఇక నేనేమి సేయుదునే
ఆను. కత్తి కోతగాడు మగడేమి జేసునో
పొత్తు మరువకుండు పోయివచ్చెదసామి ॥
(3) సామాన్య : ద్రవ్యార్జనమునకు పరపురుషుల యందు అనురాగము ప్రదర్శించునట్టిది.
ఉదా : ప.
పూసలోని దారమువలె
యెంత చేసెనే నమ్మినందుకు
ఆ. ప. మోస మేమని యడిగితే
తగని రోసమే వేణుగోపాలుడు
అటకమీద సరిగ చీరచాటుగ
నా పె కిచ్చి సేవించు కొనెనట
కటకటా యితని పేరు దలచిన
కాశియాత్ర పోయిన తీరదు.<?poem>
(1) ప్రోషిత భర్తృక : పతి దేశాంతర మందుండగా వేదన పడునట్టిది.
ఉదా : <poem>భామరో ! ఊరికి బయలు దేరెడి వేళ
ప్రేమమీర నాసామి పిలిచి చెప్పినమాట
ఏమని తెల్పుదు ఏలాగు తాళుదు
ఏమి సేతునే చెలియ ॥
"అన్నమందక అతి వెత నొందకు
కన్నీరు గార్చకు కలవరింపకు” మని
ఎన్నెన్నొ విధముల హితవుల దెల్పుచు
కన్నీరు గార్చుచు కాంతుడు చెప్పినమాట.
(2) వాసక సజ్జిక : ప్రియుడు వచ్చుచున్నాడని తెలిసి, తా నలంకరించుకొని అనుభవయోగ్యములైన పదార్థము లను సిద్ధపరుచునట్టిది.
ఉదా :
అక్కట మరుపాయె నౌర మరేమాయె
అక్కర దెలిసి రావై తి వదేమాయె ॥
ఏడాది పండుగ నేడని యెంచి
యీ మేడ శృంగారించితి
జలకమ్ముల నాడి వల్వయు ధరించితి
కస్తూరిబొట్టు వాడిగా నొనరించితి
నాడునాటికి వేడుకల్ బల్పోడిమిగ సేయుదామని
యా వాడవాడల చేడె అంపిన
లేడు లేడని మరలివచ్చిరి ॥
(3) విరహోత్కంఠిత : సంకేతస్థలంబునకు ప్రియుడు రాలేదని చింతించునది.
ఉదా :
సామిని రమ్మనవే సఖియరో
సామాన్య దొరగాడే ॥
(4) అభిసారిక : ప్రియుని గూర్చి తాను బోవునది లేక ప్రియుని తన యొద్దకు రప్పించుకొనునది.
ఉదా :
మగువ తన కేళికా మందిరము వెడలెను.
వగకాడ మాకంచి వరద తెల్లవారె ననుచు ॥
(5) విప్రలబ్ధ : ప్రియునిచే వంచింపబడి చింతించునట్టిది.
ఉదా :
కథితసమయే ౽పిహరి రహహ! నయ యౌవనం
మమ విఫలమిద మమలరూప మపి యౌవనం
యామి హే! క మిహశరణం.
సఖీజన వచన వంచితా ౽హమ్ |
(6) ఖండిత : అన్యస్త్రీ సంభోగ చిహ్నములు గల్గి ప్రాతః కాలమున ఇంటికి వచ్చిన నాయకుని జూచి కోపించు నాయిక.
ఉదా :
చల్లనాయెనా మనసు చల్లనాయెనా
చల్ల నాయె ప్రాణేశ స్వామి మువ్వగోపాలా,
వద్దికి రావేమోయి వాడిన ముఖమేడదోయి
నిద్దుర కన్ను రెప్పలపై నిండియున్న దేమోయి
అద్దపు చెక్కిలి నొక్కి ముద్దిడుకున్న దెవతోయి
దిద్దిన కస్తూరీబొట్టు చెదరెనేమో దెలుపవోయి.
(7) కలహాంతరిత : పతిని అవమానించి పిమ్మట పశ్చాత్తాపపడు నట్టిది.
ఉదా :
మోసమాయెనే నాబుద్ధికి మోసమాయెనే
మోసమాయె ఏమి సేతు మువ్వగోపాలుడు నేడు
మ్రొక్కి వేడిన రాడే ఓ చెలియరో.