Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభినయము నాట్యమ్ నృత్తమ్ నృత్యమితి మునిఖిః పరికీర్తితమ్ నాట్యం తన్నాట కే ష్వేవయోజ్యం పూర్వక థాయుతమ్ రసభావ విహీనంతు నృత్త మిత్యభిధీయతే రసభావ వ్యంజకాది యుతం నృత్య మితీర్యతే. నాట్యము, నృత్తము, నృత్యము అని భరతము మూడు విధములు. అందు నాట్యము నాటక ములందు పూర్వకథతో గూడియుండునట్టిది. రసభావ విరహితమయి కాళ లయల నాశ్రయించి యుండు అంగ ప్రత్యం గోపాంగముల విన్యాసము నృత్తము. రసభావములు కలిగియుండి తాళ లయల ననుసరించి, భావానుగుణముగ ప్రదర్శింపబడెడి అంగి కాభినయము నృత్యము. ఏతత్రయం ద్విధాభిన్నం లాస్య తాండవ సంజ్ఞిక కమ్ సుకుమారంతు తల్లాస్యం ఉద్దతం తాండవం విదుః. సుకుమారమైన అంగవిన్యాసము, భావప్రకటనము కలిగినట్టిది లాస్యము. గంభీరముగా, ఉద్రేక పూరితముగా నుండునట్టి నృత్యము తాండవము. మరియు సభలందు కూర్చుండి రసభావముల నభినయించుట లాస్యముగాను; నిలబడి తాళలయల ననుసరించి నృత్యమాడుట శాండ వముగాను జెప్పుదురు, అభినయ విధానము

కంఠేనాలంబయే ద్గీతం, హస్తే నార్థం ప్రదర్శయేత్ చతుర్భ్యాం దర్శయే ద్భావం, పాదాభ్యాం తాళ మాచరేత్ . అభినయించువారు కంఠముచే గీతమును శ్రావ్యముగా బాడుచు, ఆ పాట యొక్క అర్థమును పతాకాది హస్త ములచేత తెల్పుచు, రసభావములను దృష్టిభేదములతో జూపుచు, తాళమును పాదములతో ప్రదర్శింపవలెను. మరియు పతాకాది హ స్తములతో నర్తకి తానుపాడెడి గీతముయొక్క అర్థమును అభినయించునప్పుడు, దృష్టి యెల్లప్పుడును హస్తమును అనుసరింపవలెను. దృష్టినిల్చిన చోటనే మనస్సు లగ్నమగును. అట్లు లగ్నమైన మనస్సు నందు భావము, భావమునుండి రసము పుట్టుచున్నవి. 'రస' మనగా ః మనస్సుచే నెరుగదగిన సుఖవి శేషము; భావజ్ఞులచే ఆస్వాదింపబడుచున్నది; రసిక హృదయముల స్రవింపజేయునట్టిది. 238 అభినయము : అభిపూర్వస్యణీజ్ ధాతో రాఖ్యానార్థస్య నిర్ణయః యస్మా త్పదార్థాన్నయతి తస్మా దభినయః స్మృతః. అభి- యనెడు ఉపసర్గ పూర్వమందుగల ణి ధాతు వునకు చెప్పుట అని అర్థము. పదముల యొక్క అర్థము ప్రజలకు అభిముఖ మగునట్లు పెంపొందించి తెల్పునట్టిది అభినయము, విభావానుభావముల సహాయముతో ఒక భావమునుగాని, అనుభవమునుగాని ప్రేక్షకులకు తెలియ జేయునట్టిది అభినయము. ఇట్టి అభినయము ఆంగికము, వాచికము, ఆహార్యము, సాత్త్వికము- అని నాల్గు విధములు. ఆంగికము అవయవములతో ప్రదర్శింపబడునట్టిది. ఆంగికాభినయము : అనగా ఒక పాట యొక్క అర్థ మునుగాని, నాటకములోని ఒక సన్ని వేశమునుగాని, ముద్రలతో విపులీకరించుట (ఈముద్రలు నాట్య శాస్త్రాదు అందు విపులీకరింపబడినవి). ఇందు భావము ఉండదు. గీతార్థమును దెల్పునట్టి అంగవిన్యాస ముండును. ఇట్టి అభినయము ముఖ్యముగా వర్ణనలతో గూడిన పాటలందు ప్రదర్శింపబడును. ఉదా. ప. ఇంతి చెంగల్వ పూబంతి, చెలువల మేల్ బంతి గుణముల దొంతి వినవే. అ. శ్రీకాంతుడు గాకున్న, ఖరదూషణాదుల నావంతలో పలజంప నెంతవారు నరులని చింతించి దశకంఠు డసురులు శిక్షింప జక్రి యినకులమున మంతు కెక్క జనించె శ్రీ రామాఖ్య బ్రహ్మాది సుతుండయి యనె. ఇట్టి కీర్తనలను నృత్యమందు ప్రదర్శించునప్పుడు.. ఇంతి, చెంగల్వపూబంతి, చెలువల మేల్ బంతి, గుణముల దొంతి. ఇట్లు ప్రతిమాటకు ఆ అర్థమునకు సరిపోవు హస్త మును (ముద్రను) పట్టి అభినయింపవలసియుండును. ఇట్టి ముద్రలతో గూడినదే ఆంగికాభినయము. వాచికము : నాట్యమందుగాని, నాటకమందుగాని పాత్ర యొక్క రసభావములను పోషించువిధమున సంభా షించుటగాని, గానము చేయుటగాని వాచిక, మగును.