Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని, చెప్పదగిన విషయము నృత్యమాత్రోపయోగిగా నుండునని తెలియబరచి, ఆ విషయమునుగూడ, 'ప్రథమంతు శిరోభేదః దృష్టిభేద స్తతఃపరం గ్రీవాహర్తా తతః పశ్చాత్రమేణైవం ప్రదర్శ్యతే.' అని శిరోభేదములు, దృష్టి భేదములు, గ్రీవాభేదములు హస్తభేదములు అని నాల్గు విధములుగా విభజించి చెప్పెను. దేవేంద్రుడు అసురనటుడగు నటశేఖరుని నట శేఖరుని నాట్యమునందు తానతిశయించుటకై ఉపదేశము కోరిన వాడు గనుక, ఆతని యుద్దేశము నెరవేరుట కెట్టి అభి నయ విజ్ఞానము అవసరమో, అంతవరకే సర్వజ్ఞుడగు నంది కేళ్వరుడు సంగ్రహించి ఉపదేశించె ననుకొన్నచో, ఈ గ్రంథముయొక్క వైశిష్ట్యము కొంత తేటపడగలదు. సాధారణముగా సమస్త నాట్యశాస్త్ర గ్రంథముల యందును శిరో-దృష్టి-గ్రీవా. హస్తాభినయ భేదములు, తద్వినియోగ పూర్వకముగా నిరూపింపబడుచున్నట్లే, ఇందుగూడ అవి యన్నియు సంగ్రహింపబడినవి. తొమ్మిది శిరోభేదములు, ఎనిమిది దృష్టిభేదములు, నాల్గు గ్రీవా భేదములు, ఇరువది యెనిమిది అసంయుత హస్తభేద ములు, ఇరువదినాల్గు సంయుత హస్తభేదములు చెప్ప బడినవి. కడమ నాట్యశాస్త్రముల మాట యెట్లున్నను, భరతనాట్య శాస్త్రముతో పోల్చి చూడగా, అందు పదు మూడు శిరోభేదములు, ముప్పదియారు దృష్టిభేద ములు, తొమ్మిది గ్రీవాభేదములు, ఆరువదినాల్గు హస్త భేదములు కానవచ్చుచున్నవి. అభినయ దర్పణము శిరో భేదముల, సంఖ్యా-లక్షణ. వినియోగములయందు భరత నాట్య శాస్త్రము కంటే భిన్నముగా నున్నది. మరియు నాట్య శాస్త్రీయాభినయ మంతము రసవినియోగము పొందునట్లు నిరూపిం పబడినది; అభినయదర్పణము నందలి విషయమో, భావ పర్యవసాయిగా గోచరించుచున్నది. ఒక విషయమున మాత్రము అభినయదర్పణము తన ప్రత్యేకతను నెలకొల్పుకొను చున్నది. సంయు కా 2.సంయుత హస్తభేదములను మొత్తముగా నందు ఏబది రెండుగా గోచరించినను, కొన్ని విశేషాంశముల ప్రదర్శ నము నిమి త్తము, నందికేశ్వరుడు మరికొన్ని - అనగా 145 అసంయుత హ స్తభేదములను - క్రొత్తవాటిని చేర్చి - వివరించి యున్నాడు. వాటిలో దంపతీమాత్రాది 30 . 233 అభినయము బాంధవ్య హస్తములు 11, బ్రహ్మాదిదేవతా హస్తములు 18, నవగ్రహ హస్తములు బి, దశావతార హస్తములు 11, బ్రాహ్మణాది హస్తములు 4, సప్తసముద్ర హన్త ములు 7, గంగాది నదీహస్తములు 14, ఊర్ధ్వలోక హస్తములు 2, అశ్వత్థాది వృక్షహస్తములు 28, సింహాది మృగహస్తములు 22, పారావతాది హస్త ములు 21, భేకాది బలజంతు హస్తములు 5, వెరసి 145 అసంయుత హస్తభేదములు కలవు. సాధారణ హస్త భేదములును ఈ విశేషహస్తభేదములును కలిసి, 197 అయి, అభినయ దర్పణము నాట్యారాధకులకు ముఖ్యముగా హస్తాభినయ విషయమున కల్పవృక్షముగా నున్నది. భరతార్ణవమునకు సంగ్రహరూపమైన అభినయదర్ప ణమే ఇట్టిది కాగా, మూలగ్రంథమనదగు దానియం దే యే విషయము లెంతెంత విపులముగా నిరూపింప బడినవో ఊహించుట దుష్కరము కాదు. బి. వేం. శే. అభినయము :- "నటుడు తన హృద్గత క్రోధాది భావములను శరీరాది చేష్టల వలన వ్యక్తీకరించుట అభి నయము. రామ యుధిష్ఠిరాదుల యవస్థలను రంగాది సాహాయ్యముచేత చూపుట అభినయము యొక్క ప్రయో జనము. అభినయమునకు అనుకరణ మావశ్యకము. లోకమునందు తండ్రి తన కుమారుని ముద్దాడుట అభి నయ మనిపించుకొనదు. పితా పుత్రులు కానివారు వారి వేషములు వేసికొని, అందు తండ్రివేషము వేసికొనిన వాడు కొడుకువేషము వేసికొనిన వానిని ముద్దాడిన అది అభినయమగును." అట్లే కోతికి సహజమైన చేష్టలు అభినయ మనిపించుకొనవు. కాని ఆ చేష్టలనే మానవుడు అనుకరించి చేసినచో అది అభినయ మనిపించుకొనును, ఆభినయమున కిది పొమాన్య నిర్వచనము. ఇంక శాస్త్ర సమ్మతములైన వివరములు పేర్కొన బడును. అభినయము భరత శాస్త్రమునకు సం బంధించినది. 'భరతము'ను ఈ క్రింది విధముగా విభజింప వచ్చును. TT భరతము నాట్యము నృత్యము వృత్తము తాండవము లాస్యము అభినయము