పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


     సింహాసనాసీనుఁ జేయుట ధర్మ మీ
            తని యధికార మే ననుమతింప
    నాక్షేపణ మొనర్తు”నని ధిక్కరించి యా
            జయచంద్రుఁ డేగెనాసభను వీడి
         
గీ॥ యతనివెంట నాబూపర్వతాధికారి
   వ్యాఘరాజేంద్రుఁడును బట్టణాధినాధుఁ
   డసమబలుఁడు భోళాభీముఁడా క్షణంబ
   కదలిపోయి రాస్థానరంగంబు వదలి.34
   
సీ॥ తుహినాద్రినుండి సేతువుదాఁకఁ దనరు న
           ఖండ భారతఖండ మండలంబు
    సకల మేకచ్ఛత్ర సామ్రాజ్యముగ ధరి
           త్రీ రాజ్యమేలెఁ బృధ్వీనృపాలుఁ డా
    [1]
            జయంబు సామంత ధారాధిపతుల
    పౌరుష విక్రమ ప్రాభవంబులు
          ధర్మసంస్థాపనాచార్య చతురతలును
          
గీ॥ చంద్రభట్టారక సుకవి చక్రవర్తి
   వ్రాయు శతసహస్రాధిక గ్రంధమందు
   రససమృద్ధిని బర్వపర్వంబునకును
   జీవకళ లుట్టిపడఁగ రంజిల్లు చుండు.35
   
   [2]
   చ॥ అమిత విశాలమై సిరు లనంతముగాఁగల కాన్వకుబ్జ రా
    జ్యము మును దక్షిణాపధమునందును వ్యాపన మొందె రాజసూ
    యము నల ధర్మనందనుని యవ్వలనీ జయచంద్రుఁ డొక్కఁడు
    క్కు మిగిలి చేయనేర్చె నృపకోటి యొనర్ప సమస్త కార్యముల్. 36

గీ॥ [3] అధ్వరము చేసి యతడు నిజాత్మజాత
    పరిణయ మొనర్పఁగా స్వయంవరముఁ జాటి
    సకల దిగ్దేశవర్తి రాజన్యులకును
    బంపె వైవాహి కాహ్వాన పత్రములను.37

[4]సీ॥ తనకెకాదింక భూ స్థలి రాజులకు నెల్లఁ
         బెడ్డయా రారాజు . పృథ్వి రాజ .
    మౌళి కాహ్వాన మంపమి యట్టులుండ,
        నావిభు విగ్రహము రచింపించి, సేవ
    కుని దుస్తులిడి, తీసి కొనిపోయి యా
        స్థానమున మహాద్వారంబు ముంగల నిడె !
    నాస్వయంవరమున కరుగుదెంచిన సర్వ
        భూమీశ్వరులు ద్వార సీమ నిలువఁ
        
గీ.॥ బడిన యాతనిఁ జూచి సంభ్రమముభయము
   నొంది గుసగుసల్ వోవుచు నొదిగియొదిగి
   కూరుచుండిరి; మందార హారముఁ గర
   మందుఁ గొనివచ్చె సంయుక్త యచటి కపుడు.38

   
మ॥ విమతుండాజయచంద్రుఁడున్ నృుపుల వేర్వేఱన్ నిరూపించి వా
    రి మహావైభవ ముగ్గడింప విని నీరేజాస్య కన్నెత్తి చూ
    డమి నుద్యోగులఁ జూపెఁ; గాంతయును దాఁ టన్ జొచ్చె; నాస్థానరం
    గమునం దందఱఁ జూపెఁ దండ్రి; సతియున్ గాంక్షింపలే దెవ్వరిన్ {{float right|39 }
    
మ॥ పెనుకోపమ్మున మండి యాతఁడు సుతన్ బృథ్వీశు బింబంబు త్రో
    వను గేల్వట్టియు నీడ్చుకొంచరిగి “నా బం టీతనిన్ జూడు; మి








   

  1. వీరనరు సహస్రాదిక యుద్ధముల్
               ధర్మసంస్థాపన తత్పరతయు
        నతని సామంత ధరాధీశ్వరుల భూరి
               పౌరుష విక్రమ ప్రాభవములు - పాఠ్యాన్తరం(1958 ప్రతి)
  2. -: సంయుక్తా స్వయంవరము :- (1958 ప్రతి )
  3. అవలఁ దన పెంచు సంయుక్తయనెడు కన్య - పాఠ్యాన్తరం-1958 ప్రతి
  4. సీ॥ తనకెకాదింక భూస్థలి రాజులకు నెల్లఁ
               బెద్దయౌ రారాజు పృధ్వీరాజ
        మౌళి కాహ్వాన మంపమి యట్టులుండ
               నామహాప్రభు విగ్రహము రచింపించి సే
        వకుని దుస్తు లిడుచు నుద్వాహమండ
        పము మహాద్వారంబు పరగడ మోడ్పుచే
               తులతోడఁ దలవాల్చి నిలువఁజేసె
               
    గీ॥ నల స్వయంవరాహూతులై యచటఁ జేరు
       భూమివతులెల్లఁ దుచ్ఛమౌ బొమ్మఁ జూచి
       సంభ్రమాశ్చర్య చకితులై చాలఁ దడవు
       నిలిచి రనిమేషులగుచు బొమ్మల విధాన. - పాఠాంతరం-1958 ప్రతి
  5. సీ॥ "నృపమకుటములు తన్ని జనించె నామహా
                  భాగు సేవకుఁజేయఁబాడి గాదు
         భువనోన్నత ప్రాభవుండైన మేటి యా
                  తని కెగ్గుచేయుట తగవుగాదు
         రణరంగ ఫల్గుణ ప్రఖ్యాతి గల వీర
                 మౌళి నొప్పరికింప మేలు గాదు
        శ్రీరమారమ ణావతారు జగద్వంద్యు
                 నవమాస మొసరింప ననువు గాద
         హాస్యమునకై యొక పెద్ద యట్టచేత - పాఠాంతరం-1958 ప్రతి