పూ ర్వ పీ ఠి క
యెద మొలిచెన్ మనోరథము లెన్నియొ; గాలికి నూడి దేవి శ్రీ
పదముల రాలె మొగ్గ! యది వంద్యమె, తజ్జని ధన్యమాటచే.53
ఆ॥ పూర్ణ చంద్ర మూర్తి పుత్రుఁ డుద్భవమొంద
నమరులైన వలవ దనరు సరియే!
యిచ్చినట్టి దేవుఁ + డెత్తి కొంపోయినఁ
బొగుల నేల వగపు మిగుల నేల! 54
గీ॥ అవగుణంబులు మిగుల మా యంగఁజేసి
సుగుణములను వేయంత లెచ్చుగను జేసి
ప్రణయరతులైన నరుల దేవతలఁజేతు
వోవియోగమ! నీవృత్త ముత్తమంబు. 5555
మ॥ జననీ! నీవు దయాసముద్రమవు! యుష్మద్భక్తు నేవేళలం
దున నేరీతిని గష్టసౌఖ్యముల యం దున్ దేల్పఁగానుందు వా
పనులన్ నీవయి తీర్పఁగా ననుభవిం పన్ వంతుగున్ గాక ! వ
ల్దన నే నెంతటివాఁడ! నాకెపుడు నీ శ్రీ యాజ్ఞల్ శిరోధార్యముల్.56
సీ॥ స్థిరమగు వానిలో స్థిరతమంబగు చోటఁ!
జిరపుణ్యరతులు వసించు చోట!
నాశమెప్పుడును గ , నంగఁ బోవని చోట!
నానందనిలయమై యలరుచోట!
వ్యాధు లించుకయును బాధ సేయని చోట!
సత్యంబు స్థాయిగా జరుగు చోటఁ!
గైవల్య లక్ష్మికిఁ గాపురంబగు చోటఁ!
జిత్తంబునకు శాంతిచె డని చోటఁ!
గీ॥ బ్రేమ యమృతరూపమున వర్షించు చోట!
నామణిద్వీప రత్న సింహాసనమునః
శ్రీభవానీపదంబుఁ జే రితివి ! గాన
నేల నీకయి వగవఁ! గా మేశ్వరయ్య ! 57
గీ॥ జర నమలుచున్న యస్థిపంజరము నాది!
యింక సుఖమొందఁ గల యాసలెందు లేవు;
మధుర దరహాస వదన పద్మంబు నీది
మఱచిపోవుద మన్నను మఱపు రాదు.58
సీ॥ కలశపాథోరాశి గర్భమందు జనించు
నలల బంగారు టు య్యాల లందు!
నలచతుర్దశలోక ములను బావనమాచుఁ
దనరు మణిద్వీప తటము లందు!
గొడుగులు వంచిన ట్లడరు కదంబ వృక్ష
వితాన శీతల చ్ఛాయ లందుఁ!
శ్రీలఁ జెన్నారెడి చింతామణీ భద్ర
సింహాసనము పార్శ్వ సీమ లందుఁ!
ఆ॥ బాల కడలి చలువఁ దేలు తెమ్మెరలందు!
నీడు లేని పసిఁడి మేడ లందు!
గౌరి లోకజనని శ్రీ కామేశ్వరస్వామిఁ
ద్రిప్పి కూర్మి నాదరించుఁ గాక!59
క॥ ఈమహనీయ గ్రంథముఁ
గైమోడ్చుచు నంకితమ్ము గా నిచ్చెద నే
బ్రేమఁ బెనుప నోచని నా
కామేశ్వరు నెత్తి పెంచు కామేశ్వరికిన్.60
డి. రాజశేఖరం.