Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


            
            
    పాశ్చాత్యుఁడైన నెప్పటికి టాద్దొర రాజ
               పుత్రుఁడే యనుచు సమ్మోదమంది:
    రతఁడును రాజపుత్రావనికొఱకుఁ బ్రా
               ణములైన నిచ్చు చందమున మెలఁగె;
               
గీ॥ నమ్మహాత్ముండు వ్రాయు గ్రంధమ్మునందు
    వీరరసతరంగములతో క్షీరజలధి
    కరణి మాధుర్యములు పెంచు చరితలెన్నొ
    కలవు కలవారియిండ్ల బంగారమట్లు.
    
శా॥ ఆకర్ణద్వయపావనంబగు చరిత్రాంశంబు లందెల్లఁ గ
    న్నాకై దివ్యరసాలవాలమయి సత్య న్యాయ సంపూరితం
    బై కన్పట్టెడి నాప్రతాపు చరితం బద్దాని గోస్తనీ
    పాకంబొప్పఁగ నొక్క దొడ్డకృతిగా వ్రాు బ్రయత్నించెదన్.”
    
మ॥ అన "నీమాటలు వేదవాక్యము; లవశ్యంబిప్డు రాణాప్రతా
    పుని గీర్తింపు; మతండు వీరజనతా పూర్వాభిగణ్యుండు; క
    మ్మని నీకైతకు నమ్మహాప్రభుని ధర్మ శ్రీరతుల్ హాటకం
    బునకున్ సౌరభపూరముల్ గలుపు సొంపున్ గాంచి వాసిన్ గనున్"