పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6



గీ॥ పక్వమగు తీయమామిడిపండుమాడ్కిఁ
   బద పదంబున రసముట్టి పడుచునుండఁ
   బదియు నెనిమిది వందలు పద్యములను
   గావ్యముగ వ్రాసి కంటి వ ఖండకీర్తి !

గీ॥ సరళముగను జల్లఁగనుర సంబుఁగురిసి
   తన్మయత్వముఁ గూర్చి గ్రంథంబునడుపు
   ప్రజ్ఞ నీసొమ్మటంటి; నాపట్టులందుఁ
   దిక్కనక వీం ద్రుఁ దలపించు దీప్తిఁగంటి !
   
గీ॥ ఉత్తమోత్తమ వీరుల కుండవలయు
   నుత్తమోత్తమ గుణముల కొజ్జబంతి
   నిల్వుటద్దంబునై యొప్పు నీప్రతాపు
   వీరచరితంబు “రెండవ భారతంబు” !
   
గీ॥ అన్న! నేఁటి మహాసభాధ్యక్షుఁడనయి
   బారుతీరిన విబుధులు ప్రార్థనమ్ము
   వఱలఁ “గావ్యకళానిధి” బిరుద మొసఁగు
   భాగ్యమునుగాంచి పరవశత్వంబుఁగంటి.

ప్రొద్దుటూరు.

17-12-1933

జనమంచి శేషాద్రిశర్మ.


(ఆవిష్కరణ మహాసభాధ్యక్షులు.)



ఎచ్చట నేరసము చిలుకవలయునో అచ్చట నారసము గలదియై, నిర్దుష్టమై,
“రెండవభారత” మన్నంత యంద చందములతో మీకవిత యున్నదని నాకుఁ దోఁచినది.
ఇది సూత్రపాయమైన నా ముఖ్యాభిప్రాయము.

చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి


(తిరుపతి వెంకటేశ్వరులు)


కడియం.


నమస్కారములు. తాము సాదరముగ పంపిన “రాణాప్రతాపసింహ” చరిత్రమును
కృతజ్ఞతతో స్వీకరించినాను. దాని నామూలాగ్రముగఁ జదివితి. చరిత్ర గ్రంథమును
కావ్యముగ వ్రాసి రసవంతముగ నిర్వహించడము కష్టమైనపని. మీ కథాకథనవిధాన మిప్ప
టి కద్వితీయమైనదని చెప్పిన అతిశయోక్తి అని తలంపరని నమ్ముచున్నాను. ఇంతటి పెద్ద
కావ్యాల నింతచక్కగ వ్రాయఁగల వా రింక నుండడము శుభావహము. మీకవితాధారచే
తనిసినాను. మీకు ధన్యవాదములు.

అనంతపురం.

29 - 4 - 34

చిలుకూరు నారాయణరావు,


(ఎం. ఏ. పి. హెచ్. డి.)



క॥ చదివిన భారతమేకద చ
   దువంగా వలెనటన్న సామెత వృధయై
   పొదలుఁ బ్రతాపచరిత్రము
   చదివినవారలకు నెందు సత్కవితిలకా!