160
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
గీ॥ పంక్తి భోజన మదితప్ప వలయరీతిఁ
గోటిమర్యాదలను గూర్తుఁ గొదవగలుగ
దయ్య! భటులును నీవు విందారిగించి
చల్లఁగాఁబొండు రేపు మీఢిల్లి పురికి" 318
మ॥ అనుచున్ బల్కినఁ దోఁక ద్రొక్కిన భుజంగాధీశు మర్యాద బో
రనశృంగంబులు భంగమై చనిన గోరాజంబు చందంబునన్
గినుకన్ దాల్చుచు మానసింహుఁ “డరరే! నీయున్నతిన్ బెంపు సే
యనె తౌరుష్కనరేంద్రబాంధవము చేయన్ గల్గె నాబోంట్లకున్. 319
ఉ॥ నేఁడును నక్బరీశ్వరుని నేను భరంపడి నిల్పకున్న న
వ్వాఁడు ప్రచండ వారినిధి భంగములో యనసేనలంపి మే
వాడ రసాతలంబునకుఁ బంపుచు నిన్నును బట్టితున్మి తూ
టాడక పోయియుండఁ! డిపు డైనను గండము తప్పిపోయెనే! 320
మ॥ తలతో నీపదపద్మముల్ గొలువఁ జెంతన్ జేరు నన్నున్ మహా
బలదర్పోద్దతుఁ బంక్తి బాహ్యుఁడనుచున్ వాక్రుచ్ఛె దిట్లైనచో
నిలువన్ నేర్చునొకో భుజద్వయి పయిన్ నీశీర్షమున్! గన్నులున్
దలకెక్కెన్ జుమీ నీదుగర్వమును డిందన్ జేతు నేకత్రుటిన్. 321
ને
గీ॥ తేగియె నేటి కిర్వురను బంధించియున్న
స్వామి భృత్యధర్మము! లాహవములు పెంచి
నిలువ నీడలేకుండ గుట్టలఁ జరింపఁ
జేయలేకున్న ననుమాన సింహుఁ డనకు.” 322
సీ॥ అని కోపమునఁ బల్క నాప్రతాపమహీంద్రుఁ
"డీ నిష్ఠురోక్తుల నేమిలాభ
మున్న మాటాడిన నులుకు నొందెదవేల
యిటనీకుఁ బరిభవ మేమిగలిగె
నేనయి నినుఁబిల్చి యిటుచేసియున్న లో
పంబెల్ల నా నెత్తి పయిననుండు
నీవెవచ్చితివి: సంభావించి దర్శనం
బిచ్చితి! భేదమింతేని లేక