పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

139


గీ॥ మంచి చందురుకావి రుమాలు పైన
   రాజ చిహ్నమౌ మగఱా తురాయి గులుక
   మానసింహుండు ప్రబలాభిమానధనుఁడు
   హయముడిగి పర్ణశాలకు నరుగుదెంచె. 239 239
   
మ॥ కరముల్ రెండునుమోడ్చి భూమిపయి మోకాలూని కూర్చుండుచున్
    శిరమున్ వంచి నమస్కృతుల్ సలిపినిల్చెన్ మానసింహుండు, సా
    దరచిత్తుండు ప్రతాపసింహవిభుఁ డుత్సాహంబుతో “నంబరే
    శ్వర” రమ్మిచ్చటఁ గూరుచుండు" మని సంభావించి సంప్రీతిమై. 240
    
గీ॥ “రాజపుత్రం భూస్థలిఁగల రాజులందు
     నాయనా నిన్నుఁబోలు రాణ్మణులు గలరె
     ప్రాభవమునందు యశమందు బలమునందు
     నింతవాఁడింక లేఁడన నెసఁగినావు 241
     
చ॥ ఒక త్రుటి యేనియున్ వ్యవధి యుండదు, భారతదేశ కార్యముల్
    సకలము నాపయిన్ బడితొలంగవు. వేసవియందు మండుటెం
    డకుఁ గడుదూర మిట్లు పయనంబొనరించితి, వెట్టిదొడ్డ కా
    ర్యకరణ మూనియో! తెలుప నర్హమయైనను విందు" నావుఁడున్. 242
    
మ॥ “నిజధర్మా చరణంబొనర్పఁ బురమున్ దేశంబు సర్వస్వమున్
     స్వజనంబున్ విడినాడి యెప్డుప్రబల స్వాతంత్య్రము గొల్చి బే
     రజమెక్కింత యెఱుంగ కుండెడు మహారాజర్షి నీపాద పం
     కజముల్ గొల్చుటకన్న నిప్డు మఱి యేకార్యంబు నాకుండెడిన్ 243
     
సీ॥ హారావళీపర్వ లాటవిరాజ్యంబు
. కొండ గుహలు కొల్వు కూటములును
    బూచిన పెనువృక్షములు సితచ్ఛత్రమ్ము
             లాగండశిలలు సింహాసనములు
    విరుల గుచ్ఛమ్ములు వింజామరమ్ములు
             పంచాస్య వితతి సేవక గణంబు,
    ప్రకృతి సౌందర్యంబు భాగ్య సౌభాగ్యంబు
             జ్ఞానమే మోక్ష లక్ష్యంబు గాఁగ