పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

127



    భరతఖండంబు కం పము పట్టి మేవాడ
            మునిఁగి క్రిందికి గ్రుంగి పోవుఁగాక
    యవసులతోడి బాంధవమూన' నిన్నాళ్లు
            మని తురుష్కులకూడు తినఁగజాలఁ
            
గీ॥ గాన బలమెల్లఁ జూపి సంగర మొనర్చి
   గెలిచి స్వేచ్ఛాభిమానముల్ నిలుపుకొనుటొ
   దురమునను వ్రాలి మరణమొందులొ నిజంబు
   కలుగ దెందును మధ్యమార్గంబు నాకు. 185 185
   
క॥ ఇది నానిర్ణయ" మన “మం
   చిది యెల్లర కనుసరింపఁ జెల్లు: నటులె చే
   యుదు" మని నందఱు గదలుచు
   సదనములకు వెళ్లి రధిక సంతోషమునన్. 186
   
మ॥ "పరివారంబులతో ధనావళులతో వస్తుప్రపంచంబుతో
     నరుగన్ గావలె నేఁడె యందఱు జనుల్ హారావళీ గహ్వరో
     త్కరముల్ చేరఁగః నెవ్వ డాజ్ఞను దిరస్కారంబు గావించినన్
     ధరపైరాలుఁ దదీయ శీర్ష'మని మ్రోఁతల్ పెట్టె ఢక్కా ధ్వనుల్187
   
గీ॥ అట్టె హారావళి పర్వ తాంతరమునఁ
   బరిణయము లొక్కలక్షయు జరిగెనేని
   యంత జనబృంద ముండఁబో దనఁగఁదనరె
   నఖిలదేశంబు ప్రజమెల్ల నచట నుండె. 188
   
-: మేవాడ్దేశమంతయుఁ బాడువడి యరణ్యముగ మాఱుట :-

సీ॥ రాజులు నివసించు ప్రాసాదములు గూలి
              వన మృగంబులకు నివాస మయ్యెఁ
    బొలములలోన వి త్తులు రాలి మొలిచి చె
              ట్లాకాశమును దాఁకు నట్లు పెరిగెఁ
    గొలఁకులలోఁ గూప ములలో జలము నిల్చి
              వాడుక లేమిని బాడు వడియె