పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

కా మే శ్వ ర్యై న మః

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర

ద్వి తీ యా శ్వా స ము


మ॥ వరసౌఖ్యంబులకు నిరోధమగు నేర్పాటుల్ దొలంగించి సు
    స్థిరత బెంచు వ్యవస్థలన్ దీటముగాఁజేకూర్చుచున్ సత్య ధ
    ర్మరతుల్ మీఱఁగ రాజ్యమేలు కొనుచు రాణాప్రతా పావనీ
    శ్వర మందార మొకానొకప్పుడు సలుంద్రాభర్త నీక్షించుచున్. 11
    
సూక్తసింహుని రాజధాని కంపుమని ప్రతాపసింహుడు కృష్ణసింహు నర్థించుట.

మ॥ "మొదలన్ నెత్తురు పంచుకొంచునుజుఁడై పుట్టొందె , నాపైన బా
     ల్యదశన్ బైనను బ్రక్కనున్ బడుచుఁ దుల్య ప్రేమతో మైత్రికా
     స్పదమై వర్తిలె సూక్తుఁ డొక్కటి నన్ బాయం డొకప్డైనఁ ద
     ల్లిదరిజేరఁడు ప్రాణ మొక్కఁడు డల్ రెండైన యట్లుండెడిన్ .2
     
గీ॥ రాము నుపమ నాయెడఁ బల్కరాదు గాని
     ఱెప్పవాల్పక కనుపెట్టిరేయుఁ బవలు
     ననుచరుండయి నన్గొల్చునపు డతఁడు ని
     జంబు మూఁడుమూర్తులకు లక్ష్మణుఁ డెసుమ్ము. 3
     
గీ॥ సూర్యవంశ ప్రదీపుఁడౌ సుతు విపత్తుఁ
     బాపి కాపాడి తనుచు నీభవ్య యశము
     నలుదెసలఁ బ్రాకె సూక్తుఁ డనంతకోటి
     జన విజయ సూక్తుఁడగుదుఁ దేజమునఁ బెఱిఁగె. 4