పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. ముకుర మంటదు గిన్నెర ముట్టఁబోదు
బూలు దాల్పదు గంధంబుఁ బూయఁబోదు
వీడెమును సేయ దొరులను జూడఁబోదు
విరహపరితాపభరమున వేఁగుచుండి. 559

ముద్రాలుప్తోపమా రూపకాతిశయోక్తి హేతూపమ రూపక సందేహ సంకర యథాసంఖ్యస్మృతి మత్ప్రత్యనీకయుక్తహేత్వాలంకారము
సీ. గోపికాకోపనాటోపభాగభిరామ
గ్రీష్మర్తుమిహిరభాభీష్మధామ
యాతపోద్గారి మహాకౌస్తుభసువక్ష
ఖలవిదుంతుదశిరోదళనచక్ర
సాంకవ మృదమగపంకమేచకదేహ
ఫాలాక్షసన్నుతపదసరోజ
యాదికుంభీనసానల్పతల్పక
యతులితవజ్రహస్తానుజన్మ
గీ. యను చెలికరాక్షి వచనముఖానిలములు
గాంచి కిసలయోత్పల శుక గంధపవన
ములఁ దలఁచి మధు విధు మార మలయములును
దనదు గన్నులఁ గట్టిన దారినుండి. 560

మంత్రవర్ణనవచనము
వ. ఆసమయంబున నిజకీర్తిప్రకాశకరుండైన యాకాశరాజు నిఖిలతంత్రప్రవీణులగు మంత్రులం బిలిపించి, దొలుత బుడుతనెలఁదాలుపు ముదల పాలించిన తెఱం గెఱింగించి, తమ్మికంటికిఁ గూఁతు నొసంగ సంగతంబే యని యాలోచనఁ గావించ నాలోకనాయకుని కిచ్చుటకన్న నెన్నభాగ్యం బున్నదే యని ధీమంతులగు మంత్రులు మంతుకెక్కఁ బలికిన, నానందతరంగితాంతరంగుండై, కుల, రూప, గుణ, విద్యా, ధన, బల, రాజ్య, తపంబు లనియెడు నష్టమదంబుల నహంకరించక, శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, స్కాందంబు లను షడ్దర్శనసముండై మీఱి, బ్రహ్మాండ, విష్ణు,