పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84 ఆ 0 ధ్ర క వి త ర 0 గి జి తాను మహాభారతకృతికర్త యగు తిక్కన సోమయాజి కులవ ర్ధనుఁడనని కవి యీక్రిందిపద్యములోఁ దెల్చుకొని యున్నాఁడు. చ, అనువుగ భారతాంబునిధి యవ్వలికికా దగ నీది యందులో ఘనకవితామృతంబు చవిగాంచిన తిక్కనసోమయాజి సా వనతరమైన యట్టికులవర్ధనుఁడ నహిఁ జేరుగల్లు ਾਹ తనకవి సూరనాహ్వయుఁడ ధర్మగుణ ప్రతిపాలనీయుఁడకా క్కనసోమయాజి వంశములోనివాఁడననియు, “నూతన కవి’ బిరుదనామమనియుఁ జెప్పకొనుట కవి యభిప్రాయమేమో! అని యీపద్యమువలనఁ లోఁచుచున్నది కాని తిక్కనసోమయాజి గౌతమ గోతుఁడును, ఈతఁడు కౌశిక గోత్రుఁడునగుట నావంశమువాఁడని చెప్పవీలులేదు. తానును నియోగి బ్రాహ్మణుఁడ నని చెప్పి తిక్కన సోమయాజియందుఁ దనకుఁగల గౌరవమును వ్యక్తీకరించుటయే కవి యుద్దేశమని గ్రహింపవలసియున్నది. ఈకవియే కాలమువాఁడ తెలియఁద గిన యాధారము లేమియుఁ దొరకలేదు. పూర్వకవిస్తుతిలో నీకిందిపద్యమున పురాణయుగకవు లను మాత్రమే బేర్కొనియున్నాఁడు, చ, అలఘుని శబ్దశాశనపదాంకితుఁ దిక్కనసోమయాజి ని శ్చలమతి శంభు దాసు బుధసన్నుతు నాచనపోమనార్య జె న్నలరిన చిమ్మపూడియమరాథిను భాస్కరు రంగనాథునికా దలఁతు నపూర్వదివ్యకవితామహనీయ సమగచిత్తులకా, ఇంతమంది పూర్వకవులను జెప్పి మధ్యకవులలో నొక్క-నిని జెప్పకపోవుటచేత ఇతఁడు మధ్యకవులలోఁ జేరినవాఁడేమో యని సందేహము కలుగుచున్నది. అయినను స్వతంత్రములైన యితరాధార ములు లేక మధ్యకవులను జేర్కొనకపోయినంతమాతమున నితఁడు మధ్యక వియని నిశ్చయించుటకు వలనుపడదు. కాని యితఁడిన్నూఱు సంవత్సరిములకిందటివాఁడని యైనను జెప్పవచ్చునని లోఁచుచున్నది. అని బ్ర, శ్రీ, వీరేశలింగము పంతులుగా రాంధ్రకవుల చరిత్రములో వాసియున్నారు, }