పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపద కావ్యము

21

గపటంబుతోఁ గాల - గతుల భావించి
యెపుడు పేదలనైన - హెచ్చింప నేర్చు,
మునుకొని హెచ్చించి - మోసంబు చేసి
ధనమదాంధులనైనం - దగ్గింప నేర్చు,
నీ పెండ్లి కూఁతురే - యెల్ల జాతులను
చాపల్యము నటించి చరియింపుచుండుఁ
గావునఁ బసిబిడ్డ - గాదు; మీ మాట
లీవేళఁ గాదన - నేల? నా కడుపు
గొప్ప యంటిరి, నేను - కోరినవెల్ల 390
నిప్పుడు [1]వడ్డింపుఁ - డేల దాఁచెదరు?'
అన విని తుంగ భ - ద్రాదులు నగుచు
ఘనపదార్థము లెల్లఁ - గ్రక్కునఁ దెచ్చి
రాసులు వోసి, పా - ర్వతిని వీక్షించి
'బోసేయు' మన, శైల - పుత్రి యిట్లనియె :
“ఒనర వడ్డించితి - రో యత్తగారు!
పనిఁబూని యాఁకలి -పాయునే దీన?
డీకొని మీరు వ - డ్డించిన వెల్లఁ
బ్రాకటంబుగ నొక్క - పంటికి రావు!
పొలుపొంద ననుఁ దృప్తి - పొందితు మనుచుఁ 400
బలికితి, రదియుద-బ్బఱ లాయెఁగాని,

  1. వడ్డింప కేల దాచెదరు - పూర్వముద్రిత పాఠము.