పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

తే.గీ. కృతయుగంబున శ్రీదేవి యతిముదమున
భ్రామరీదేవియయ్యె నప్పాపులైన
దుష్టరాక్షసులను జంప నిష్టలీల
నపుడు ఋషులెల్ల బ్రార్ధింప నలరిదేవి

కృతయుగములో "ఆదిశక్తి భ్రామరీయను అవతార మెత్తెను. అపుడు దుర్మార్గులయిన రాక్షసులను జంపునట్టి శక్తి దేవతలకు కలుగునట్లు యీ భృంగరాజమను గుంటగలగరాకును ఆశక్తి సృజించెనని ఆదినాధ సిద్ధుడు నవనాధ సిద్ధునకు చెప్పెను.

తే.గీ.మానవులకును రోగముల్ మాన్పునట్టి
యోషధిని భృంగరాజము నొసరసృష్టి
జేసే నప్పటి నుండియు క్షితిని హృద్య
వైద్యశాలలు ధన్యురై వాడుచుండ్రు.॥

అప్పటినుంచి యీ గుంటగలగరాకును వైద్యులందరు వాడుచుందురు.

క. అని భృంగరాజ మహిమము
పనిబూనుక శుద్ధమైన ప్రతిగా జేసె౯
ఘనమైన దాసు వంశం
బున బుట్టిన రాము డధిక మోదముతోడ౯.॥

శ్లో. సలక్షా పద్మినీ జాయా బృంగరాజ్యస్య సర్వదా
తద్యోగే జాయతే శక్తిః సర్వరోగ నివారిణి.॥

దీని యర్ధమును అర్హులయినవారు భృంగరాజ మహిమము పూర్తిగా తెలిసిన పెద్దల వలన గ్రహించ వలసినది.

(భృంగరాజ మహిమము సమాప్తము.)
_________________________________________________


ఈ ప్రాచీన గ్రంధమును శ్రమతో వెతికి యిచ్చి ప్రచురణకు ప్రోత్సహించిన శ్రీ దాసు వద్మనాభరావు గారికి కృతజ్ఞులము.

- సంపాదకుడు.