పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

13



గణ్యవాక్పటిమ వొంగఁగఁ బఠించినను280.
తెలిపినన్ శుభములు తిరముగా సిరులు
కలితసౌఖ్యారోగ్యఘనభాగ్యకీర్తు
లలఘువైభవము లత్యర్ధముం గల్గి
వెలయుదు రటు గాన వినుఁడు తెల్పెదను
నావుడు మౌను లానంద ముప్పొంగ
నీవసుధోద్ధార మిటు సల్ప [1]నిటకు
నాదివరాహమై యవతీర్ణుఁ డగుట
యాదిగ శ్రీ వేంకటాద్రివైభవము
వివరింపు మన విని వే సూతుఁడటుల
వివిధ వృత్తాంతముల్ వివరింపఁదొడఁగె.290.

శ్రీ రమణుఁడు వరాహావతారమున భూమి నుద్ధరించుట.


శ్రీ రమణుఁడు మున్ను శేషతల్పమున
క్షీరాబ్దిని శయించి చెలఁగునవ్వేళ
లీలచే భువనముల్ సృజియించుకోర్కె
నాలోన తననాభి నంబుజం బొప్పఁ
గలిగించి యా దివ్యకమలంబునందు
నలువఁబుట్టించి యా నలువకు స్మృతుల
దయ నుపదేశించి తతపంచభూత
మయలోకనిచయ నిర్మాణపాటవము
కల్పింప నారీతి కమలసంభవుఁడు
కల్పాదియందు లోకములు సృజింపఁ300.
బూని నీరము వహ్ని పుడమిని గాడ్పు

1.

  1. వ్రా.ప్ర. సల్బవేటికి.