పుట:శృంగారశాకుంతలము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

శృంగారశాకుంతలము

     భుజగకన్యక నాడించుఁ [1]బూరినమలి
     యనఘ కణ్వమునీంద్రు పుణ్యాశ్రమమున.
మ. పవనుం డాహుతి గంధము ల్గొనుచుఁ బై పై వచ్చె నాసాపుటీ
     వివర ప్రీతిగ నాస్వదింపుము చతుర్వేదోక్తమంత్రధ్వనుల్
     కవియం బారెడు యజ్ఞవాటముల నాకర్ణింపు వీక్షింపు న
     చ్చె వియద్వీథికి హోమధూమలతిక ల్జీమూతజీవాతువుల్.46
వ. సంయమీంద్రులు నరేంద్ర నీ విచటికి వచ్చుట తమదివ్యజ్ఞానంబున నెఱింగి
     యున్నవారు నీ వెఱుంగమి చేసికొనిపోవక యాయురైశ్వర్యాభివృద్ధి
     కరంబును, గలుషకర్శనంబును నగు తాపసదర్శనంబుఁ జేసిపొమ్మని
     యమ్మునివరుండు నిజేచ్ఛం జనియే నృపవరుండును నచటనుండి యరదం
     బెక్కి చనుట యుచితంబు గామింజేసి, తేరు మాలినీతీరంబున నునిచి
     శరాసనాదిసాధనంబులు సారథిచేతి కిచ్చి, తేవనంబునం బరమపావనం
     బగు తపోవనంబు సొచ్చి.47
సీ. శుకగర్భకోటరచ్యుతములై నివ్వరి
                    ప్రా ల్కిందఁ జెదరిన పాదపములు
     దలలకు గాక కాయలు నూఱ నందులఁ
                    జమురంటి [2]మెఱయు పాషాణతతులు
     నిబిడవల్కలశిఖానిష్యందరేఖల
                    [3]జాఱులుగల జలాశయపదములు
     దమమేను లొరసికొంచు మనుష్యు లరిగిన
                    భయమునఁ జంచలింపని మృగములు
తే. గలిగి యన్యోన్యమైత్రి నక్కడఁ జరించు
     పులులకూనలు, జింకపిల్లలు, మృగేంద్ర
     పోతకంబులు, నాలక్రేపులును గదుపుఁ
     గట్టికొని కూడియాడ నక్కజముఁ జెంది.48

  1. బూని
  2. మెఱచు
  3. జాదులు