పుట:శృంగారశాకుంతలము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31

క. సారథిఁ గనుఁగొని యవు డా
     క్ష్మారమణుఁడు రథము దవ్వుగా వచ్చెఁ బరీ
     వారము గూడదు రా నె
     వ్వారలు గల రిచట నిలువవలయు ననుటయున్.121
వ. అతండును నృపాలకానుశాసనంబునం దేజుల నేఁగనీక వాగెలు గుది
     యించి వీపుఁలు నిమిరి నిలుపుటయు సకలజనంబులుం గూడుకొని
     యుల్లసితయానంబున మెల్లనం జని మంద చేరంజను నయ్యవసరంబున
     విజయకాహళారావంబు లాలకించి బిరుదధ్వజవితానంబు లవలోకించియు
     దమ రాజు రాకఁ దెలసి నిసర్గభీరువులగు నాభీరువులు భీతచేతస్కులై
     నవీనంబగు హయ్యంగవీనంబు గానుక తెచ్చి ప్రణామంబు లాచరించి
     కరంబులు శిరంబునం బెట్టుకొని తిర్యగాలోలంబు లగు చూపులం గద్గద
     కంఠ లగుచు బ్రస్ఖలితనయవాక్యంబుల నిట్లని విన్నవించిరి.122
సీ. దూరంబువచ్చిన [1]వా రిట సైన్యంబు
                    ప్రజలెల్లఁ జాల దూపట్టినారు
     నీర్వట్టుగొని దీర్ఘనిశ్వాసములతోడ
                    వరరథ్యములు వ్రేలవైచెఁ జవులు
     వేటకుక్కలు డస్సి వివృతాస్యముల
                    నిల్చి వగరించుచున్నవి దగలుదొట్టి
     శిథిలపక్షముల నక్షియుగంబులు న్మోడ్చి
                    శ్రమనొందె డేగలు సాళువములు
తే. తిమురు మధ్యాహ్న మయ్యెను దేవ యిచట
     నేఁడు [2]కాలాగి మామందపాడి చూచి
     గోరసముఁ బాయసంబులు నారగించి
     నిగ్రహంబైన మమ్ము మన్నింపవలయు.123
గీ. అనుచు విన్నప మొనరించు నవసరమున
     హయము డిగ్గి మాండవ్యుఁడు రయముతోడ

  1. వా రౌట
  2. కాల్మాగి