పుట:శృంగారశాకుంతలము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

25

సీ. కాననేక్షువుల ముక్తములైన ముత్యాలు,
                    ముదిరిపండిన మంచి వెదురు బ్రాలు,
     దినములోఁ [1]గ్రొత్త యెత్తిన కఱ్ఱజవ్వాది,
                    ముక్కులు మురియని [2]మొరళిపప్పు,
     జంద్రికారుచిఁ బొల్చు చమరవాలంబులుఁ,
                    బొందుగాఁ గాఁచిన [3]పూతివడువు,
     అలఁతి దంతంపుఁగామల పీలిసురటులు,
                    సోదించి వడిచిన జుంటితేనె,
తే. కమ్మఁబిల్లులపిల్లలు, కారుకోళ్ళు,
     కన్ను దెఱవని కస్తురిగమి శిశువులు,
     పులులకూనలు, భల్లూకపోతకములు
     నాదిగాఁ దెచ్చి పతి కుపాయనము లిచ్చి.98
వ. ప్రణామంబు లొనర్చి కేలుదోయులు ఫాలంబులం జేర్చుకొని వినయ
     వినమితస్కంధులై క్రిందుచూపుల నిల్లుతారల వారం గనుంగొను
     చున్న వారల నవలోకించి చిత్తంబు మృగయాయత్తం బగుటయు
     నృపోత్తముం డి ట్లనియె.99
క. దలముగఁ గ్రొవ్విన మృగములు
     గలిగి సమీపమున నేఱుఁ గాలువ [4]యేదేఁ
     గలిగి తఱచైన తరువులు
     గలిగిన పేరడవి యెచటఁ గలదు గణింపన్.100
క. నావుడు వారలు విభుతో
     దేవర వేటాడవలసితే విచ్చేయం

  1. యెత్తిన
  2. మొకరిపప్పు
  3. పూతి వఱపు
  4. యెందే