పుట:శృంగారశాకుంతలము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

83

     ట్కుంభికుండలిరాజ కచ్ఛప కుంభినీధరబంధుదో
     స్తంభసంభృతభూమిమండల, సంగరోరగకుండలా.9
క. బాణాసనబాణతను
     త్రాణకృపాణములతో రథస్థుఁడ వై, నీ
     వేణాంకకులజ! రాదగుఁ
     [1]గౌణపదుర్జనులు గలరు క్రతువిఘ్నకరుల్.10
క. [2]అనవుడు నట్టే కాకని
     జనపతి యమ్మౌనివరుల సన్మానముతో
     ననిచి రణోచతపటుసా
     ధనసంపద సొంపుగా రథస్థుం డగుచున్.11
వ. పచేళిమంబు లగు పనస, సహకార, నారికేళ, ఖర్జూర, జంబూ, జంబీర,
     రంభా, కపిత్థ, కర్కంధూ, తిందుక సౌగంధికాది సుగంధబంధురఫలంబు
     లును, నొడిపి ప్రాలు, దూసరిబియ్యంబు, నివ్వరివడ్లు, గునుకు, లూద
     లాదిగాఁ గలుగు వన్యధాన్యంబులు, ముడియలం, గావళ్ళం పెట్టించు
     కొని కదలి కదలికా, చందన, స్యందన, మరువకా, గరు, కురవకా,
     గోక, పూగ, పున్నాగ, భూర్జ, ఖర్జూర, సర్జ, కార్జున, శిగ్రు, న్యగ్రోధ ,
     గుగ్గులు, మధూక, వ్యాధ, కింశుక, ఇంగువ, చూత, జంబీరో, దుంబర,
     కదంబ, వంజుల, కుంజరాశన, కరంజ, భల్లాతకీ, సల్లకీ, చిరబిల్వ, బిల్వ
     ప్రముఖ, వివిధ, విటపికోటరక్రోడక్రీడాచిక్రోడ, కంక, కలవింక, కంపి
     జల, ఖంజరిట, కపోత, పారావత, శారికా, శుక, పిక, శిఖాతళావళి
     ముఖరితం బగు వనంబునం బ్రవేశించి, యతిచపలవిపులకపిలంఘనంబులం,
     గరువలితాకులం బాయక రాలు పండ్ల నవిసి తొరఁగు ననేకవిధ
     స్వాదురసంబులు పెనువఱదలై పండి పగిలిన కాననేక్షు దండ ప్రకాండం
     బులం బర్వ నిర్ముక్తంబు లగు ముక్తాఫలరాసులపైఁ బొరలిచి [3]పరవం
     దామ్రపర్ణీస్థలవిశేషంబు నభినయించు నభిరామప్రదేశంబులం గనుంగొను
     చుం జనిచని తాపసపరిషదుపనిషదుపబృంహితబ్రహ్మవిద్యాతర్క

  1. గాణప
  2. అనవుండు నట్టె కాకని
  3. పరువం