పుట:శృంగారశాకుంతలము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

77

ఉ. కన్నులతీరుఁ జక్కని మొగంబుమెఱుంగును, జౌకళించు లేఁ
     జన్నులమించు, నెన్నడుము సంశయలేఖయు, మేనియందముం
     బెన్నెఱివేణి సొంపు మురిపెంబును, దిన్ననిమోవికెంపులున్
     వన్నెలుగాని కావు రవణంబులు వన్నియ లాలతాంగికిన్.183
మ. నవలావణ్యపయోధిఁ జిత్త మను మంథానాద్రికిం జంద్రికా
     పవనాశిం దరిత్రాఁడుగాఁ బెనఁచి యబ్జాతాశుగుం [1]డిచ్చినన్
     రవలిం గోకిలకీరము[2]ల్దరువ నారత్నాకరంబందు ను
     ద్భవముం బొందిన లక్ష్మి కావలయు నాపద్మాక్షి భావింపగన్.184
ఉ. చిత్తరవు న్లిఖించి మఱి జీవము వోసెనొ రూపసంపదం
     జిత్తమునం దలంచియ సృజించెనొ రెండును జర్చ సేయగా
     జిత్తరువందు నాకరణి చెల్వము గల్గదనన్యచిత్తుఁడై
     చిత్తమునం దలంచియ సృజించెఁ బితామహుఁ డాతలోదరిన్.185
శా. ఆదిం జంద్రుఁడు చంద్రికారుచుల నయ్యబ్జాస్యఁ గల్పించెనో
     లేదేఁ గంతుఁడు చెల్వము ల్వెరఁజి యాలీలావతిం జేసెనో
     కాదేఁ జైత్రుఁడు తావు లెల్లఁ గొని యాకాంత న్వినిర్మించెనో
     వేదాభ్యాసజడుం డజుం డెటులఁ గావించుం దదీయాకృతిన్.186
సీ. పాలమున్నీటిలోపల సంభవించిన
                    జలజాతనయనల చక్కదనముఁ
     జంచలాలతికల జననంబు గాంచిన
                    ధవళలోచనల సౌందర్యలక్ష్మి
     నమృతాంశుకళలయం దావిర్భవించిన
                    నీలవేణుల రామణీయకంబు
     బుండ్రేక్షుకోదండమునఁ బుట్టు వొదవిన
                    లావణ్యవతుల విలాసరేఖ

  1. డించినన్
  2. దరవ