పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 47

దండ నొకవేళ నీతిసంధానలీల
బుద్ధులన్నియుఁ దెల్పు నప్పుడమివేల్పు. 178

క. ఈరీతి సకలధర్మ[1]వి
చారుం డగునతనిమాట జవదాటక య
గ్గౌర మనుచున్నఁ దన్నగ
రీరత్నం బేలునట్టి నృపవరుఁ డెలమిన్. 179

తే. మంతు కెక్కిన యవ్వసుమంతు ననున
యించి ప్రియభాషణంబుల హితవొనర్చి
జలధి కవ్వలదీవులఁ గలసమస్త
వస్తువులు బొక్కసముఁ జేర్పవలయు ననుడు. 180

ఉ. రా జొనరించు మన్ననకు రంజిలి యవ్వసుమంతుఁ డష్టది
గ్రాజమనోభయంకరపరాక్రముఁ డానృపుతోడ నేన య
వ్యాజత దీవి కేగి కలవస్తువు లన్నియుఁ దెత్తుఁ బంపుమో
రాజకులేంద్ర యంచు సుకరంబున మున్ను వచించి పిమ్మటన్. 181

క. తననగరుఁ జేరి సమధిక
ధనధాన్యసుపుత్రమిత్రదారాలయమం
డనమైన కాఁపురం బిది
యను వగునే విడిచి చనుట కని చింతిలుచున్. 182

ఉ. కారుమెఱుంగురాచిలుక కస్తురివీణ పదాఱువన్నె బం
గారము రస్తుకుప్ప తెలిగంబుర వెన్నెలలోని తేట యొ
య్యారపుఁడెంకి యందముల కన్నిటికిం దగుపట్టుగొమ్మ సిం
గారపుదొంతి యైనకులకాంత నయో యెడఁబాయనేర్తునే. 182

  1. విశారదుఁడగు—శబ్దరత్నాకరము