పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 43

గొనిన నప్పతంగపుంగవం బక్కటా! యిక్కురంగనయన కనంగతత్త్వంబు సంభవించె నిది సామంబునం గాని చక్కంబడదని తలంచి లంబికావలంబనమహాయోగిచందంబునఁ గొండొకతడపు నిశ్చలధ్యానపరాయణం బైయుండి వెండియు నయ్యంగన కిట్లనియె. 158

క. వినవమ్మ భామినీమణి
మనమున నీ కితరసంగమము ప్రియమైన
న్మును గొంతి కమలబాంధవు
నెనసియుఁ బొన మెఱుఁగునట్లనే వర్తిలుమీ. 159

తే. కాక తలవెఱ్ఱి గొని యలగౌతమాంగ
నామణి సురేంద్రు నొకనాఁడు నంటుచేసి
యాపదలఁ జెంది సకలలోకాపవాద
మొందు టెఱుఁగవె యట్లు గాకుండవలయు. 160
క. నీపట్టు గలుగువాఁడై
చేపట్టుంగుంచ మైన చెలువుని నొకనిం
జేపట్టి రతులఁ దేలక
యేపట్టున రాజు నిచ్చయించితి వబలా. 161

సీ. రాజులు కుటిలసర్పమహోగ్రతరమూర్తు
లధరబింబము పంట నదుము టెట్లు
సార్వభౌములు చండశార్దూలసమచిత్తు
లించువేడుకఁ గౌఁగిలించు టెట్లు
[1]కువలయాధీశ్వరు ల్దవహుతాశనకల్పు
లండనుప్పొంగి పరుండు టెట్లు

  1. అవనీతలేశ్వరులాహుతాశనకోఫులు—పాఠాంతరము