పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 శుకసప్తతి

చితానవరతాగురుధూపవాసనావాసితంబును నై విరాజిల్లు నాస్థానభవనరాజంబు వందిమాగధబృందంబు లందంద కైవారంబు సేయం బ్రవేశించి బంధుహితామాత్యసామంతజనంబు లభ్యర్ణప్రదేశంబున వసియింపం బేరోలగంబున నుండి సముద్భటవీరభటరాహుతసంఘంబుల కొల్వుగైకొని భూసురాశీర్వాదభాసుర మంత్రాక్షతంబు లుత్తమాంగంబునన్ ధరియించి విద్వజ్జనంబులకు నమస్కరించి స్వప్నప్రకారంబు విన్నవించిన విననవధరించి వార లిట్లనిరి. నీలనీరదశ్యామాకృతియగు రఘుపతి ధనుర్బాణపాణియై మ్రోలనిల్చుటంజేసి దిగ్విజయంబు సకలజగన్మాత యగు సీతసందర్శనంబుపవలన నిరంతకసంపత్పరంపరావాప్తి యగు నిజాగ్రజన్మసేవాశుభలక్షణుం డగులక్ష్మణవిలోకనంబుకతన గురుభక్తి యుక్తియును గలుగు నీస్వప్నంబు వివిధశోభనప్రయత్నంబులు దెలుపుచున్నయది. నీయట్టికృతార్థున కిట్టిమహత్త్వంబు లబ్బుట యాశ్చర్యంబే మహావంశసంభవుండవు ధైర్యస్థైర్యశౌర్యాదార్యగాంభీర్యలతాలవాలంబగు భవద్వంశావతారం బభివర్ణించెద మాకర్ణింపుము. 14

తే. సారమై శౌరికేళికాసారమైన
పాలమున్నీటివలన సంభవము నొందెఁ
గువలయామోదకారియై కుటిలచక్ర
హారియై సత్కళాధారి యైనరాజు. 15

క. ఆయమృతాంశుఁడు త్రిజగ
ద్గేయుం డగురౌహిణేయుఁ గిల్పిషహరణో