పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

426 శుకసప్తతి

క. అదె కంటివె శ్రీముష్ణము
నదెపో యక్కాంతి గోపురాగ్రనిరీక్షా
విదళితదూరాగతకో
విదజనసంసారఘోరవిధతృష్ణంబున్. 178

సీ. ఈవనంబుల వెట్టి యింద్రపట్టణసీమ
హవణించు నందనం బయ్యె నేమొ?
యీమేడలప్రమాణ మింతని పద్మజుం
డమరింప సురశైల మయ్యె నేమొ?
యీయంగజులవస్తు లేమైన గిలుబాడ
యక్షేశునకు నిధు లయ్యె నేమొ?
యీసరస్థితిఁ జూచి యెవ్వరో యీరీతి
నడరింప మానసం బయ్యె నేమొ?
గీ. యీపురముతోడ జోడుగా నెన్నిమారు
లైన గావింప వైకుంఠ మయ్యె నేమొ
నంతపయిలేక నిది సేర నబ్బుటెల్ల
మన మొనర్చినభాగ్యంబు మంత్రితనయ! 179

క. ఏతన్మాత్రమె విభవస
మాతత మిది దక్షిణప్రయాగ యనఁగ వి
ఖ్యాతం బీశ్రీముష్ణం
బీతరి సేవింపఁగలిగె నీశ్వరుకరుణన్. 180

మ. కనుఁగొంటిన్ ఘనమార్గలంబితచణాగ్రస్వర్ణకుంభంబుతో
వనము న్నర్కవిమాన మచ్చటఁ జుమీ వారాహదేహంబుఁ జెం

దిన నాతండ్రి ముకుందుఁ డాఢ్యుఁడు రమాదేవీసహా