పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 421

సీ. ఎందుండివచ్చునో యినకోటినిభచక్ర
మరుదెంచు దకిణహస్తమునకు
సమయమౌ టెఱుఁగునో ఘుమఘుమధ్వనిశంఖ
మపు డొద్దు వాయకరాగ్రసీమ
యెవ్వరు పనుతురో యలహేమచేలంబు
జగనీటుగసు కటీచక్రసీమ
తరివేచియుండునో తతమణీకోటిర
మవతీర్ణమగు నుత్తమాంగమునకు
గీ. పతగరాజోక్తతారకబ్రహ్మమంత్ర
మంత్రములు కొన్ని వీనులవల నటింప
తనువుతో బొందు సడలించు ధన్యమతికి
భూసురోత్తమ శ్రీముష్ణపురమునందు.

శా. శ్రీముష్ణంబు సమస్తవైష్ణవమహాక్షేత్రాళికిన్ రాజసే
వామంత్రంబున పాపలోపకరణవ్యాపారపారీణమై
యామోదం బొదవించు నిచ్చు బలదీర్ఘాయుంగళావైభవం
బేమో యంచు మదిం దలంచెదవుసుమ్మీ మంత్రిరాణ్నందనా.

వ. విశేషించియుఁ బంచమహాపాతకంబులసైన్యంబ పటాపంచలంబు గావించుసమయం బొక్కటి గలదు. అది పరమరహస్యం బిత్తఱి బశ్చాత్తాపమునం జీకాకుపడు నీకుఁ దెలుపందగు నిం దెవ్వరు లేరుగదా! దగ్గఱకు రమ్ము! కృతాఖిలజనోగ్లాసంబగు మాఘమాసంబున, నక్షీణపుణ్యలక్ష్మీవిధానపక్షంబగు శుక్లపక్షంబున, దుర్దమదురితమర్దనఘనంబగు చతుర్దశిదీనంబున, శ్రీముష్ణంబున, నిత్యకృత్యంబులు నిర్వర్తించి, రథోత్సవోత్సాహుండగు వరాహదేవుని భజియించి, యవ