పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 శుకసప్తతి



సీ. మరకతంబులయొప్పు మైనుప్పతిలనొప్పు
గోమువాఁ డెలనవ్యుమోమువాఁడు
వనజాతములబింక మెనయుకన్గవ పొంక
మమరువాఁ డొకవింతమకొమరువాఁడు
చిలిక్రొంబగడంపు జిగిగుంపురవణంపు
మోవి వాఁ డెనలేనిఠీవివాఁడు
మిసిమిబంగరుచేల పసమించుకటిలీలఁ
జెలఁగువాఁడు శుభాప్తి మెలఁగువాఁడు
తే. దివ్యకోదండశరకాండధృతకరాబ్జ
యుగమువాఁ డెన్నరానిసోయగమువాఁడు
జానకీలక్ష్మణులతోడ స్వామి రాముఁ
డెలమిఁ గలలోన నా చెంత నిలిచె నంత. 11

క. కని విస్మయసమ్మోదము
లెనయ న్భయభక్తియుక్తహృదయుఁడనగుచున్
వినయస్థితి నల్ల జగ
జ్జనకున కే నతు లొనర్చి సంప్రీతుఁడనై. 12

క. ఉన్న తరి నన్నుఁ జూచి ప్ర
సన్నాననుఁడై సుధారససదృశమృదువా
క్యోన్నతి శుకసప్తతికృతి
చెన్నలర మదర్పణంబు సేయుకుమారా!

క. ఈవిధమున మాయనుమతిఁ
గావించితి వేని సకలకవిబుధజనసం
జీవన మై నీవంశము
పావన మై వెలయు మత్కృపామహిమాప్తిన్. 13

వ. అని యద్దేవుం డానతిచ్చిన మహాప్రసాదం బని యంగీకరించి యత్యంత భయభక్తి కరకమ్రనమ్రశిరస్కుండ నై