పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 395

గనకంటె నేను దక్కువై
చని కాళిక చెంత బాససలిపి గెలిచెదన్. 44

మ. అనుచుం గ్రక్కున గేహము న్వెడల దాయాదు ల్మహాసాధ్వివి
ట్లు నినుం బేర్కొన మింక నీసడియె చాలుం జాలు రమ్మంచు వెం
టనె రాఁగా నిది యే మొకో యనుచు నానామానవు ల్గుంపులై
కనుఁగొంచుం జనుదేఱఁగా నడిచెం దత్కాళీమహాస్థానికిన్. 45

సీ. తనవారు పిలువఁగా వినక బాసయొనర్పఁ
జను టేటికో యని యనెడువారు
నాఁడుఁబుట్టువు చెడ్డదవుఁగదా యిటువంటి
యపకీర్తివచ్చెనే యనెడువారు
నపకీర్తివచ్చిన నడఁపక యింటివా
రగడు చేయుట దోస మనెడువారు
నగ డేమి చేసి రియ్యతివ తానే వారి
కారడి గల్పించె ననెడువారుఁ
తే. జూడవచ్చిన నచ్చుముచ్చో యెఱుంగ
కాడరా దేల యీపాప మనెడువారు
బయలుదేఱిన యపుడె యీపడఁతి జంత
యగుఁజుమా యనువారు నైరపుడు జనులు. 46

వ. వెండియుం దండోపతండంబులుగా మెండుకొని యాలోకించు పురజనంబుల కోలాహలంబు విచారించి సంభ్రమాశ్చర్యంబుగా నరిగి యూడిగంపుఁ బడఁతులు విన్నవించిన నన్నగరాధినాథుం డగు నరపాలుండు విస్మయంబున నగరు