పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 299

వ. తన్మత్స్యహాసంబునకుం బూర్వంబునం బ్రవర్తిలిన కదళికావిక్రమార్కులవాక్యంబు లామ్రేడితంబుగా విని యంజనముఖంబున నిక్షేపంబునుంబోలె మనీషాబలంబునం దత్కారణం బెఱింగి యయ్యా యీయాశ్చర్యంబు వధూశాంబరీవిడంబనంబునం బొడమినయది పాముజాడ పామునకుంగాని పరులకుం దెలియఁబడని తెఱంగున నంగనలకుంగాని యిత్తెఱంగుఁ గనుంగొన మీకుఁ గొలఁదిగా దీగుట్టు బట్టబయలు గావించినం బాపంబు ప్రాపించుఁ గావున విజనాంతరంబున నుపాయంబున భూనాయకున కేఁ దెలిపెద నని యజ్జనకునివెంట వసనాచ్ఛాదితాందోళికారోహణంబునం దెరమఱుంగునం గూర్చుండి యక్కురంగనయన యనుప్రసంగంబు దిగిచి రాజపుంగవుతో నిట్లనియె. 236

తే. విక్రమార్కేంద్ర సర్వజ్ఞ చక్రనర్తి
వయ్యు నిక్కార్య మనయుల నడుగఁదగునె
యడిగితేని నిజోదంత మవల నొడివి
యడలు పద్మినిఁ బోల్పఁ బట్టగుదువీవు. 237

వ. అనుచుం బల్కెఁ దదనంతరంబు ప్రభావతీరమణీమణి యరుణోదయంబుఁ గాంచి కేళీనిశాంతంబున కరిగి యానాఁటిరేయి భూనాయకుపొందు డెందంబునం దలంచి యానందంబునఁ గందర్పశాంబరీమత్తవేదండంబు చందంబున మందమందగమనంబునం జనుదేర మన్మథతురంగంబు గనుంగొని యంతరంగం బుప్పొంగ నయ్యంగనామణి కిట్లను న ట్లాబాలసరస్వతియు నావైసారిణహాస్యంబు నాకారరేఖాపరాభూతకుసుమశరాసనుం డగునారాజన్య మూర్ధన్యుతో