పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 249

నారదస్తుతప్రభావనవ్యమేఘసన్నిభా
భారతీశశాంకకీర్తిభాసుసూరిరంజనా! 586

గద్య. ఇది శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధార పాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక కదిరీపతినాయక ప్రణీతంబైన శుకసప్తతియను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.