పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 207

బలికలినీళ్లుఁ జందనపుమానికెఁ గొల్చినమాళ్లు గల్గి శో
భిలుదురు రెడ్డిబిడ్డలు కుబేరుని పిల్లలనంగ నచ్చటన్. 406

[1]తే. అచట నొక రెడ్డి వెలయు హలాంకుఁ డనెడి
పేరుగలవాఁడు కులములోఁ బెద్దయింటి
వాఁడు బొంక నెఱుంగనివాఁడు వాఁడు
పట్టినదియెల్ల బంగారు పనులపట్ల. 407

సీ. అచ్చమై వాకిట రచ్చఱాయి మెఱుంగు
పంచతిన్నెలు గొప్ప పారిగోడ
కంపతెట్టులును రాకట్టు ముంగిలి మల్లె
సాలెదేవరయఱచవికె యొకటి
కోళ్ల గూండ్లును గొఱ్ఱు కుఱుగాడి యేడికో
లులు కాఁడి పలుపులు గలుగు నటుక
దూడలు పెనుమూవకోడెలు కుఱుకాఁడి
గిత్త లీనినమేటిగిడ్లదొడ్డి
తే. యిఱుకుమ్రానుపెరంటిలో నెక్కుబావి
మునుఁగలును జొప్పపెనువామి జనము రుబ్బు
ఱోలు పిడకలకుచ్చెల దాలిగుంత
దనర నిరతంబు వెలయు నాతనిగృహంబు. 408

తే. అతనికి సుకేశి యనియెడు నాలి వెనుక
నబ్బె గుణవతి యనఁగ నిల్లాలొకర్తు

  1. ఉ. అందున వానికెల్లను హలాంకుఁ డన న్నొకపెద్దరెడ్డి చె
    ల్వొందు సుభోగుఁడై నగరిలోపల వన్నియగన్న యట్టివాఁ
    డందునఁ బెద్దకాఁ పనుచు నందఱుఁ గొల్వఁగ లెక్కలేని వె
    ల్లందగుమిన్కులుం గలిగి యాతఁడు రాజిలుచుండు నప్పురిన్.