పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 205

బోలె నెమ్మొగం బెగయించి మీఁదఁ జూచుచు దృశ్యంబగు భయపారవశ్యంబున నున్న యవసరంబున. 395

ఉ. ఒక్కకృషీవలాచలపయోధర నాయకుప్రక్క నిద్రకుం
జిక్కి విహంగమధ్వనులచే వెడ మేల్కని తాఱుమాఱుగాఁ
గ్రక్కునఁ గట్టుకొన్న చిటికమ్ముల చీర తగంగఁ దత్కటీ
భాక్కుచకుంభ కుంభమునబాగొనరం జనుదెంచె నూతికిన్. 396

తే. వచ్చి జలములు చేఁద నవ్వామనయన
యాసనాబ్దంబు వాంచి నిజాధినాథు
తోడిపొలయల్కఁ దోయంబుఁ దొలఁగివచ్చు
వరుణసతివోలు నమ్మల్లతరుణిఁ గనియె. 397

క. కని మొఱపెట్టినఁ జెంగటి
జనులొక్కట మూఁగ వారి సందడిపలుకు
ల్విని యాడువారు సేరం
జను దెంచెం జెట్టి దట్టిచల్లడములతోన్. 398

తే. వచ్చి నిజభార్య చేసిన వగలు గాంచి
దిగులుపడి మున్నుగా నరుదెంచి యున్న
దాని యుపభర్తతోడుగాఁ బూని వెడలఁ
దిగిచి తోడ్కొనిపోయె నమ్మగువ నతఁడు. 399

క. ఏవంవిధ చాతుర్యము
నీ వెఱిఁగితివని మేదినీవరుఁ జేరం
బోవచ్చుఁ బోయి క్రమ్మర
రావచ్చుఁ బ్రభావతీ పరాకా యనినన్. 400

క. నా కేమి తెలియు నని య
క్కాకోదరవేణి కమలగంధాంధమరు