పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 169

సీ. [1]మలయుచో మధురాతిమధురాధరలవాఁడి
చిన్నారిగోరు నీచెక్కుమీఁద
నానుచో రంగస్థలాబ్జగంధులగుబ్బ
మెఱుఁగుఁజందోయి నీయురముమీఁద
మించుచోఁ గాంచికాచంచలాక్షుల ముద్దు
మొనపంటినొక్కు నీమోవిమీఁదఁ
జేరుచో నెల్లూరు నారీమణుల కెంపు
పసమించు టడుగు నీనొసటిమీద
తే. [2]నింటనుండిన నీసౌఖ్య మేల కలుగు
ననుచుఁ గన్నుల నూరార్చి యక్కుఁ జేర్చి
మోవిచిగురంట నొక్కి తాంబూల మొసఁగి
పోయిరమ్మని పనిచె నప్పూవుఁబోఁడి. 211

తే. అంత బుడిబుడి యేడ్పుతో నడలుదాని
బుజ్జగించి సువేషుఁ డప్పుడె ప్రయాణ
భయసముత్కంపితగ్లాని బంటువాని
నింటికడ నిల్పి పైనమై యేగుటయును. 212

చ. ఇపుడుగదా తపంబు ఫలియించెనటంచు మహానురక్తిభా
వపరత రేఁబవళ్లు తలవాకిలి వేసినయట్టులుండ స
న్నపువిరిదమ్మితేకువసనస్మరుతూపులఁదుప్పు మించఁగా
సపరిమితప్రమోదరసులై రమియించిరి వారలిద్దఱున్. 213

  1. ఈపద్యమే 39వ పుటలో వాడినాఁడు
  2. నింట నేయుండఁ బెఱమచ్చెకంటినంటఁ
    గూడకల్లాడు నీ కనుకూలుఁ డయ్యె
    నృపతి పయనంబు చెవ్వుట నీవుగోరు
    పోడుములు గల్గు నిఁక నేమి పోయిరమ్ము.