పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 165

క. న న్నిచట నుంచి చనియెం
గన్ని య మఱి రాక తడసెఁ గపటోపాయం
బెన్నె నొకొ యెవ్వఁ డెఱుఁగుఁ బ్ర
సన్నాంబుజముఖుల యింద్ర జాలము లెల్లన్. 191

తే. అనుచుఁ దద్భూసురుం డెంచునంతలోన
సురియ నిప్పులు రాలుకప్పెరయు మొగము
మీఁద మసిబొట్లుమించ నమ్మెలఁత రాగఁ
జూచి దిగులొంది యిదిగోఁ బిశాచి యనుచు. 192

తే. అతఁడు పరువెత్త నిదియేమి యౌర పోకు
పోకుమనుపల్కుతోడ నప్పు డది నడచి
వెంటనే యంట నీదయ వేగఁగాలి
పోవనిమ్మంచుఁ దనగేహమునకు నేగ. 193

తే. అంతలో దానిపెనిమిటి యటుక డిగ్గి
గూఢముగ నేగి పెరటి బల్గోడ దాఁటి
వెలుపటికి వచ్చి యెవ్వరే తలుపు తెఱవ
వేయనుచుఁ బిల్వ నచ్చెల్వ వేషమడఁచి. 194

క. గడియ సడలింప నతఁ డ
య్యెడ నవ్వగలాడిఁ దప్పకీక్షించి యిదే
మడరెఁ బరపురుష వాసన
చెడుగా నొడువుమని కాలఁజేతం దన్నెన్. 195

చ. అది మొద లవ్వధూమణి పరాప్తికి దండము వెట్టె వాసనా
భ్యుదయము నాయకు డెఱుఁగురో యని యెంతయుఁ గేశవాఖ్యసం

విదితతదీయమూర్తులయి వేడుకకాండ్రది తల్లి