పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118 శుకసప్తతి

క. ఆనగరీవర మేలు మ
హానటనిటలస్థలీబృహద్భానుమహా
శ్రీనిర్జితసమదరిపు
క్ష్మానాథుఁడు భీమసేన జనపతి కడఁకన్.509

క. ఆ రాజు రమ్ము పొమ్మని
గారా మొనరించి మనుపఁగా మోహనుఁడ
న్పేరుగలవాఁడు తగుగుణ
వారిధియగు నొక్కబచ్చువాఁ డవ్వీటన్. 509

ఉ. మైనపుటంటు పల్వగలమచ్చులచా లొరగల్లు కట్టెలుం
దూనిక నాలుగేన్బొరలతోఁ దగువట్రములోననున్న నా
నానగరోద్భవంబులగు నాణెము లుండెడుసంచిఁ గొంచు బే
రాసకువచ్చు నన్నయధురంధరుఁ డంగడికిం గణింపఁగన్. 510

తే. [1]అతని కనుకూలవతి రూపవతియునైన
భామినీమణి దనరు సౌభాగ్యసీమ
యాత్మనాయకపాదసేవాభిరామ
నవ్యగుణవతి శుభవతీ నామ యొకతె. 511

ఉ. ఆలలితాంగి పుష్పవతియై దివసత్రయముం గ్రమించినన్
నాలవనాఁడు దాగురుజనంబులు కుంకుము సంకు పొంకముం
బోలెడు చల్వయుం బసుపుముద్దయుఁ గైకొని తోడరా మహా
కేళిరథాంగయైన నదికిం జని మజ్జనమాడి వేడుకన్. 512

  1. అతనికులకాంత నవమోహనాంగవిజిత
    కాంతరతికాంత రుచిరరేఖానిశాంత
    వఱలు వరపాదకమలసేవానిధాన
    నయగుణవిధేయ శుభవతీనామధేయ.