పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మంగళంబుల కిక్క మదవికారములకు
          దూరంబు [1]నురువు సాధుత్వమునకు
దావానలము రాగతరుపల్లవములకు
          నపలేపతిమిరసంహతికి హేళి)


గీ.

[2]పట్టణము బ్రహ్మపురివాడ బ్రహ్మలోక-
మునకు సయిదోడు మోసల మోక్షమునకు
దూషితంబయ్యె సంసర్గదోషకలన
నంటుముట్టునఁ గలుషితంబయ్యె నాడు.

14


క.

తనయల (నిద్దఱ) నిద్దఱు
తనయులనుం గాంచి కాలధర్మమునొందెన్
[3]వనజాస్య [4]గట్టివయసునఁ
దనయుఁడు పరలోకవిధులు తల్లికిఁ [5]జేసెన్.

15


గీ.

ఏమి చెప్పంగ [6]నఱువదియేండ్ల వయసు
ముసలి సుకుమారుఁ డేకాంతమున రమించెఁ
గూఁతు లిద్దఱ బొమలపైఁ గురులు వ్రాలు
నంతమాత్రపుఁ జిన్నిప్రాయంబు వారి.

16


వ.

అంతం గొంతకాలంబునకు వాని దుశ్చేష్టితంబు లెఱింగి బ్రాహ్మణులు *(వానిని) బహివెట్టి యూరు వెడల నడిచి యారూఢపతితుండైన వాని సంసర్గంబునం బుట్టిన దోషంబు బుద్ధిపూర్వకంబు గాదు కావునఁ గొంద ఱుపవసించియుఁ గొందఱుత్తప్తకృచ్ఛ్రంబు లనుసరించియుఁ గొందలఱుు కృచ్ఛ్రాతికృచ్ఛ్రంబులు నడిపియుఁ గొందరు చాంద్రాయణంబు లాచరించియు (నెట్టకేలకు విశుద్ధి గావించిరి సుకుమారుండును).

17


సీ.

(చెలికారు లంజనాచల గండ)శిలలకు
          యమదూతలకు నభిధాంతరములు
ప్రతిబింబములు కాళరాత్రియామములకు
          బుత్రసంతానంబు భూతములకు
నశుభకర్మముల కన్వాదేశములు మౌని-
          శాపాక్షరములకు సంగడీలు
[7]కలికాలమునకు డగ్గఱిన చుట్టంబులు
          ధూమకేతువులకుఁ దోడునీడ-


గీ.

లంధకారంబులకు విందులనఁగ గిరుల-
యందు వర్తించు చెంచుల నాశ్రయించి
మనువు మనెఁ గూఁతులును దాను మహిసురుండు
కొంతకాలంబు మనములోఁ గుత్సలేక.

18


క.

ఎనుబది యేఁడుల వార్ధక-
మునఁ [8]బ్రాజనశక్తి యుడిగిపో దాతనికిం
దినియెడిది పెద్దమాంసము

  1. తా. ఉరుఉ
  2. ము. గీ. గ్రామఘోషంబు పురివాడ బ్రహ్మలోక-ము ... ..డు మొగసాల
  3. తా. వనజాక్షి
  4. తా. గండివయసున
  5. తా. దీర్చెన్
  6. తా. నిరువది
  7. తా. కలికాలములకు
  8. ము. బ్రాక్తన