పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

యిన్నిటికి నోర్చి నీ కోర్కి యేను దీర్తు
నింతవానికి [1]నీకు నన్నీయ బరువె
యెప్పటికి [2]నిత్తునో లేక యీ శరీర
మిప్పటికిఁ జాలునో నిక్కమెఱుఁగఁ జెపుమ.

73


గీ.

మొదలఁ గక్కుర్తిపడి [3]కూడి పిదప వాయు
నొక్క కమలాననకు డిక్కి యుండఁజాలఁ
డడవిఁ బెక్కు పుష్పములయందు వ్రాలు
చంచరీకంబు మగవాఁడు సరియ సువ్వె.

74


ఉ.

చందురుఁ డంత చూడఁడు నిశా[4]సతి బున్నమనాడు గూడుచో
గందళితానురాగుఁడయి కానఁగవచ్చు నవోదయంబులం
జందము దప్పి మీఁద నొకచాయకు వచ్చుఁ గ్రమక్రమంబునన్
సుందరి పట్టునందుఁ బురుషుండును [5]నట్లయకాఁ దలంపుమీ.

75


వ.*

అనిన విని సుకుమారుండు.

76


క.

మగవారల నిందింపకు
తగవును బంతంబు నిజము ధర్మముఁ గృపయున్
మగవారికెగా కెందును
మగువలకుం గలవె చంద్రమండలవదనా.

77


సీ.

హరుని చిచ్చఱకంట నసమాస్త్రుఁ డీల్గిన
          రతిదేవి యెట్లు జీవితముఁ జెందె
బాండుభూపాలుండు పరలోకగతుఁడైనఁ
          గుంతి చావక యేమి కుడువనుండెఁ
బ్రథనాంగణమున సౌభద్రుండు చచ్చిన
          బ్రతికె నెట్లు విరాటరాజతనయ
సింధురా జస్తమించిన నేల దుస్సల
          కాషాయవస్త్రంబు గట్టుకొనియెఁ


గీ.

బంక్తిరథుఁ డన్యలోకసంప్రాప్తుఁడైన
నేల కౌసల్య ప్రాణమీ నెఱుఁగదయ్యెఁ.
దగవు ధర్మంబు పాడి పంతంబు లెట్లు
భామ లెట్లు వృథానులాపంబులేల?

78


గీ.

అనినఁ జండాలకన్యక యాఁడువారి
మంచితనమును మగవారి మంచితనము
సరియ కీడని మేలని చర్చలేల
మనకు మన యాడికలు తప్పకునికి చాలు.


వ.

విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకయను నప్సరసకుం బ్రభవించిన ప్రమద్వరయను కన్యక స్థూలకేశాశ్రమవనంబునఁ బాదమర్దితంబగు పన్నగంబు గఱచినఁ బ్రవిలుప్తజీవిత యగుటయు భార్గవుండగు చ్యవనునకుఁ బౌత్రుండు ప్రమతికొడుకు

  1. ము. నన్నీగు టెరవె; తా. నీకు నం న్నింన్నుం బరచె
  2. తా. నైన నిత్తునో యీ శరీర
  3. తా. నీవు
  4. ము. నటి
  5. తా. నిట్లయ కా