పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

క..

శ్రీహిమవద్గిరిపుత్రిమ-
నోహరపదభక్తిజాతనూతనసరస-
వ్యాహారకావ్యనాయక
మోహనతనుజితజయంత ముమ్మయశాంతా.

1


వ.

అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లని చెప్పందొణంగె.

2


సీ.

కాంచనాచలముతో గర్వించి యే కొండ
          [1]పెరిఁగె బ్రహ్మాండకర్పరము మోవ
నే కొండచఱులపై హిమశైలకన్యక
          చెంచులేమలఁ గూడి సంచరించు
వజ్రాల కమరు ఠేవ విడంబనము సేయు
          నే కొండమొలచుట్టు నిందుతనయ
యల్లోనేరెడుదీవి యవనీధ్రములలోన
          నే కొండ కైశ్వర్య మెక్కుడయ్యె


గీ.

నట్టి వింధ్యనగేంద్రపర్యంతభూమి
దండకారణ్యవిపినమధ్యంబునందు
రత్నపురమనఁ గల దొక రాజధాని
కిన్నరాధీశు నగరకిఁ గీస వెలితి.

3


గీ.

స్ఫటికమాణిక్యపాషాణఘటితమైన
యప్పురముకోట యాకాశ మంటి యొప్పు
వేడ్కఁ బాతాళభువనంబు వెడలివచ్చి
[2]చుట్టుముట్టినయట్టి వాసుకియుఁ బోలె.

4


గీ.

[3]పట్టణంబున దేవతాభవనకోటి
తుహినగిరికూటములతోడఁ దులలుతూఁగు
నమరగంగాపయఃప్రవాహములఁ బోలుఁ
దచ్ఛిరస్థాపితోన్నతధ్వజపటములు.

5


సీ.

[4]ప్రణతదేవకిరీటమణిమయూఖచ్ఛటా-
          పటలకిమ్మీరాంఘ్రిపంకజుండు
వికటపాటలజటామకుటకోటిఘటిత-
          కోమల[5]తారకాకాముకుండు

  1. తా. పెరిగి
  2. ము. చుట్టుముట్టినయట్టి
  3. తా. పట్టనంబున
  4. ము. తా. మకుట
  5. తా. తోరణకోవిదుండు