పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఖండ[1]ఖండంబులుగఁ జేసెఁ గదనవీథి.


క.

వాలిక మెఱుంగుఁ దూపులు
నాళీకాసనుఁడు [2]కినుక నారాయణుపైఁ
గీలుకొనఁజేసి యార్చెను
నాలుగు మోములను [3]ద్రిభువనములు వడంకన్.

92


వ.

ఇవ్విధంబున విధాత [4]యార్చిపేర్చినఁ గోపాటోపంబునం గటకటం బడి కైటభాంతకుండు లలాటవీథీవిటంకంబున భ్రుకుటి నటింపఁ గల్పాంతవేళాసముజ్జ్వలజ్వలనజ్వాలాజాల లీలాక్రీడావహమహాప్రభామండలమధ్యవర్తియు, విబుధరిపువధూవైధవ్యదానదీక్షాధురంధరప్రభా పరాక్రమక్రీడానిర్వక్రపరాక్రమంబగు చక్రం బతని మీఁదఁ బ్రయోగించిన.

93


మ.

దిశలున్ నింగియు నేలయు బహులదీప్తి వ్యాప్తి నంతర్భవిం-
ప శతానందునిమీఁద సాగుటయు నప్పద్మాసనుండేసె బ్ర-
హ్మశిరోనామకమైన యస్త్ర(ము సమస్తాస్త్రా)ధిదైవంబు న-
వ్విశిఖం బుద్ధతి మ్రింగె నద్భుతగతిన్ వేవేగ నాచక్రమున్.

94


గీ.

హరి విధాత[5]పైఁ బాశుపతాస్త్ర మేసె
నజుఁడు హరిమీఁదఁ బాశుపతాస్త్ర మేసె
నమ్మహ్మాస్త్రంబు (లొండొంటి నాక్రమించఁ
జనియెఁ బరిపాటి దివ్యవర్షములు నూరు).

95


చ.

పటుతరవిక్రమస్ఫురణఁ బాశుపతంబులు రెండుఁ బోరఁగాఁ
జిటిలిన విస్ఫులింగములఁ జిల్లులు వోయె నభఃస్థలంబు ది-
క్తటము(లు మండె నంబుధులు గ్రాఁగె రసాతల)గర్భగోళసం-
పుటములు వొక్కె నుమ్మదము పుట్టెఁ జెమర్చెఁ బురాణకూర్మమున్.

96


ఉ.

పాశుపతాస్త్రరాజము లభంగధృతిం దమలోనఁ బోర ఘో-
రాశనిఖండసన్నిభములైన తదీయకృపీటసంభవో-
ల్కాశతముల్ పరస్పరవిఘట్టనఁ జిచ్చఱకోలలై వెసం
గేశవుమేన బ్రహ్మమెయిఁ గేలి యొనర్చె నపారవేదనన్.

97


ఉ.

కాంచనగర్భుఁడున్ నరకఘస్మరుఁడున్ బహుకాల మీ క్రియం
గాంచిరి నొచ్చి పాశుపతకాండయుగప్రభవాగ్నికీలలన్
జంచలచిత్తవృత్తి బహుసంపద పెంపున [6]మూరిఁబోయి ద-
ర్పించినయట్టివారి కివి పెద్దలె యచ్చెరువంద [7]నేటికిన్.

98
  1. ము. ఖండములుగ
  2. తా. గిన్క
  3. ము. త్రిభువనము వణఁకాడన్
  4. తా. యార్చినం బేర్చిన
  5. తా. మై
  6. ము. మూరివోయి
  7. తా. వారికిన్