పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దీపితభవ్య[1]మార్గమున దేటపడన్ మొదలింటినుండియున్.

55


గీ.

ప్రళయకాలంబు [2]తుదఁ గాళరాత్రి చనిన
[3]నపరమగు సర్గమునకు బీజాంకురంబు
శీతమును నుష్ణమును [4]గాక చిలుపచిలుప
గంధవాహంబు [5]వీచె నిర్గంధమగుచు.

56


సీ.

మూలముట్టుగ[6]ను నున్మూలనంబును బొంది
          మహిధరంబులు రూపుమాలి యుండఁ
ద్రిభువనంబులుఁ జలత్తృణరాశియునుఁ బోలె
          సప్తార్చిచేత భస్మంబు గాఁగఁ
బుష్కలావర్తకాంభోధరంబులు వృష్టి
          విశ్వప్రపంచంబు వెల్లిగొనఁగ
భూర్భువస్స్వర్లోకములు మహర్లోకంబు
          జనలోక మెక్కి విశ్రాంతి మెఱయ


గీ.

నఖిలదిక్కులు ముంచి బ్రహ్మాండగోళ
మప్పళింపుచు సప్తార్ణ(వాంబువులును)
నిండికొనియుండఁగా రిత్తనింగితోడఁ
గొంతకాలంబు శూన్యమై గొడ్డుపోయె.

57


వ.

అప్పుడు బ్రహ్మ నారాయణుండై శివయోగముద్రాముద్రితలోచనుం డగుచు సముద్రంబు నడుమం బవ్వళించిన.

58


క.

జనలోక మెక్కి సిద్ధులు
వినుతించిరి జలధిసలిలవీచీ[7]రింఖ-
ద్ఘనజాతయోగనిద్రా-
వినిమీలితదీర్ఘనయను విషధరశయనున్.

59


గీ.

దేవతలు సంస్తుతించంగఁ దెల్లవాఱెఁ
గల్పసంహారకాలంబు కాళరాత్రి
యంత మేల్కని కూర్చుండె నాదిపురుషుఁ
డాదిమబ్రహ్మ జగము సేయంగఁ దలఁచి.

60


గీ.

అభినవోన్మేషజిహ్మ మైనట్టి దృష్టి
దిశలు వీక్షించెఁ ద్రిభువనాధీశ్వరుండు
[8]చింతనొందె లోకంబు [9]సృజించు వెఱవు

  1. ము. మార్గమును
  2. తా. తుదిం
  3. తా. పరమమగు స్వర్గమునకు
  4. ము. గాఁగఁ
  5. ము. వీఁచు
  6. తా. సమున్మూలాంజనము బొంది
  7. తా. రింఖో
  8. ము. చింతనొంది
  9. ము. సృజింప