పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠ్యంతములు

క.

(సత్యహరిశ్చంద్రునకును,
నిత్యాప్రతిమాన) దాననిర్మలమతికిం
గృత్యాకృత్యవివేకికిఁ
బ్రత్యర్థిద్విరదదళనపంచాస్యునకున్.

45


క.

రామామన్మథమూర్తికి
రామత్రయ[1]లీనమతికి రమ్యాత్మునకున్
[2]సోమవ్రతవరకాంతికి
భీమజయోత్కటవిశేషభీకరమతికిన్.

46


క.

శైవాగమశాస్త్రాది
ప్రావీణ్యాగణ్యపుణ్యభరితాత్మునకున్
భావాభావవివేకికి
భావితవంశావతారపరమాత్మునకున్.

47


క.

జంభాంతకవైభవునకు
సంభృతశాస్త్ర[3]ప్రతాపశైలోన్నతికిన్
శుంభత్ప్రాభవరతికిన్
దంభోళిస్ఫురితతీవ్రతరఖడ్గునకున్.

48


క.

[4]వరముమ్మయశాంతునకుం
బరమ[5]పరిజ్ఞాననిధికిఁ బావనమతికిన్
నిరుపమవిక్రమయశునకుఁ
గరుణారసపూరితాత్మకలితాంగునకున్.

49


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధియు, నభిమతార్థసిద్ధియు, సత్యధర్మక్రియావృద్ధియు నగున ట్లష్టాదశవర్ణనాగర్భంబుగా నత్యాశ్చర్యకరంబై యుండ నా రచియింపబూనిన కథానిధానంబు సకలపాపనిర్ముక్తంబై [6]సర్వవస్తుసంధానంబై, సర్వలక్షణసంపన్నంబై, సర్వాగమానూనసంభావితసంస్తుత్యంబై, పరమధర్మోత్కృష్టంబై, పరమేశ్వరప్రియంబై, పార్వతీమనోహరంబై, శ్రీనాథసేవితంబై, *(బ్రహ్మరుద్రాది దేవతాసంస్తూయమానంబై), (యథావిధి) శోభిల్లు నిప్పుణ్యచారిత్రంబు *(దశదోషవివర్జితంబై) నా నేర్చిన విధంబున రచియించెద నది యెట్టిదనినఁ బూర్వోక్తమార్గంబునఁ బరిపూర్ణంబై యథావిధి శోభిల్లు *(నిప్పుణ్యచారిత్రంబుఁ బోలి)నట్టి ధర్మక్షేత్రంబును మహాతీర్థంబును నగు గంగాకాలిందీసంగమంబున [7]సంశ్రితాత్ములు సత్యవ్రతపరాయణులు నగు శౌనకాది మహామునులు దీర్ఘసత్రంబునందుఁ గూడియుండ (నవ్వేళ) వేదవ్యాసప్రియశిష్యుండు రోమహర్షణతనయుండు పౌరాణికుండు సూత్యాహిసంభవుండు సూతుం

  1. ము. లీల
  2. తా. సోమావృత
  3. తా. వ్రతాశశైవో
  4. తా. ధర
  5. ము. వర
  6. తా. సర్వాగమానిర్ముక్తంబై
  7. తా. సంస్థితాత్ములు