పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మారమాంబాతనూజుండు మహితయశుఁడు
వెలయు ముమ్మడి దేవయ్య వినుతకీర్తి.

34


ఉ.

శ్రీగిరి తూర్పుదేశమునఁ జెన్నగు భక్తిమహత్త్వ (మర్థిఁ దా
నా)గమవేదశాస్త్రముల నంచితధర్మకథాప్రసంగతిన్
(యాగ)విశేషసూత్రముల నాయతశక్తి సుభక్తియు(క్తుఁడై)
(శ్రీగురుఁడైన ప్రోలగురు సెట్టియ ముమ్మయ) చెప్ప నొప్పెడున్.

35


క.

వారక (సెట్టియ వీరన)
సారార్థము లయిన [1]కృతుల సభలోపలఁ దా
గారామారఁగఁ బలికిన
శారద యీ [2]రూపనంగ జగతిఁ జరించున్.

36


ఆ.

(వారిలోన వెలసె వరజయగండండు
బిజ్జ)లాఖ్య మానభీకరుండు
బసవశంకరుండు పరవాదిమండూక-
భయదపన్నగుండు [3]భక్తిఘనుఁడు.

37


క.

[4]శ్వేతాంబరుఁ బొలియించిన
ఖ్యాతచరిత్రుండు జైనకాకోదరతా-
ర్క్ష్యాతతబిరుదాంకుఁడు సం-
జాతప్రవిలీన బిరుద[5]సమ్మతుఁ డెలమిన్.

38


చ.

పరిణయమయ్యెఁ గాంతఁ గులభామిని రుద్రయపుత్రి శాంకరిన్
[6]సరసకలాభిరామ కులసంస్తుత పుణ్యచరిత్రయుక్తయై
యరయఁగఁ బుట్టినట్టి త్రిపురాంబికకూఁతురు భాగ్యదేవతన్
బరమపతివ్రతానిలయ భాసురనిర్మలగాత్రి నర్థమై.

39


సీ.

పరమపాతివ్రత్యభావంబు తలఁపంగ
          గౌరి గాఁబోలు నీ కాంత తలఁప
సకలసంపత్స్ఫూర్తి చాతుర్యమహిమల
          నిందిర గాఁబోలు నిందువదన
సకలవిద్యాప్రౌఢి సడిసన్న గరిమల
          భారతి [7]గాఁబోలు భామ యెపుడు

  1. తా. శ్రుతుల
  2. తా. రూపునందు
  3. తా. భక్త
  4. ము. పీతాంబరు
  5. తా. సమ్మదు
  6. తా. సరళకులాభిరామ
  7. తా. యననొప్పు