పుట:శివతత్వసారము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందఱికన్న మిన్నగ నాదినుండియు, నీ గ్రంథ ప్రకటనకై యభిలషించి, దీని నీనాడు వెలుగులోనికి దెచ్చి యాంధ్రసాహితీలోకమున కర్పించిన మహోదారులు - శ్రీకృష్ణాపత్రికాధితులు శివశ్రీ ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మగారు- వారికి సర్వదా కృతజ్ఞతాబద్ధుడను.

శ్రీ శర్మగారి మూలముగా నాంధ్రశైవవాఙ్మయమునకు నింకను నెంతయో యభ్యుదయము చేకూరనున్నది. ఒకప్పుడు ముద్రితములై నేడు లభ్యముగాకయున్న ఉద్భటారాధ్యచరిత్రము, పండితారాధ్యచరిత్రము మున్నగు నుద్గ్రంథములను, శ్రీ శర్మగా రిట్లే సుసంస్కృతములుగా బ్రకటించి ఆంధ్రసాహిత్యప్రపంచమున శైవవాఙ్మయజ్యోతి యఖండముగా దీపించునట్లు చేయుదురుగాక!

నా యజ్ఞతచేతనేమి, యితరకారణములచేతనేమి, యిందు పెక్కుదోషము లుండవచ్చును. గుణగ్రహణపారీణులైన విద్వాంసులు వానిని దెలిపినచో ద్వితీయముద్రణమున సవరించెదనని విన్నవించుచున్నాను.

ఇతి శివమ్

—నిడుదవోలు వెంకటరావు