పుట:శివతత్వసారము.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386-388. కవి నామాంకిత పద్యము. ఫలశ్రుతి.

389. శివభక్తులచరిత్రలు తెలియుటకు బ్రహ్మవిష్ణ్వాదులకు సాధ్యము కాదు.

399-489. ఇందు భక్తుల చరిత్రలు, భక్తమహిమలు సూక్ష్మముగా నొక్కొక్క పద్యమున సూచింపబడినవి. భక్తమహిమలశీర్షికలో గూడ భక్తచరిత్రలే గలవు. వీని వివరములను పీఠికయందు జూడనగును.

మతసాంకేతికవివరణము

11. దురితహరమనియు శుభములు
    దొరకొనుననియును దలంచి దురితారి! భవ
    చ్చరణాబ్జ భ క్తి లలనా
    పరవశభావమున నిన్నుఁ బ్రణుతితు శివా.

ఈపద్యమున షట్స్థలములలో నొకటియగు శరణస్థలము నిరూపితమైనది.

సతిపతినివలె యనన్యబుద్ధితో శివుడే శరణమని దృఢనిశ్చయముతో కొల్చు భక్తిభావన చెప్పబడినది . శైవమునందలి యీభావమే తరువాత వైష్ణవమున మధురభక్తి భావనగా సంగృహీతమైనది.

21. జ్ఞానము పశుపాశుపతి
    జ్ఞానమయని యెఱుంగజాలని జడుల
    జ్ఞానులు వారల తత్త్వ
    జ్ఞానము లజ్ఞానములు విచారింప శివా.

ఇందారాధ్యసంప్రదాయమునకు ముఖ్యమగు పశుపాశుపతిజ్ఞానము వివరింపబడినది.

పశువులు-జీవులు.
పాశము-భవము. ఇది అణవిక, కార్మిక, మాయామలరూపముగ జీవుల నంటి యుండునది.