పుట:శివతత్వసారము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

విధి వేఱ కలదె! భక్తి య
విధి విధిసహితముగ భక్తివిరహితుఁడై తా
విధియించి యశ్వమేధము
విధిపుత్రుఁడు దక్షుఁడైన విధి యెఱుఁగరొకో!

460


క.

పృథు విధి నిషేధ లోక
ప్రథితోభయకర్మరాశి బ్రాపించెన్ నీ
"పథవర్తిని [1]తేషాం మమ
యథా తథా" యనుటఁ జేసి యంబారమణా!

461


క.

శివునకుఁ దనువును [2]మనమును
శివభక్తులకును మనంబుఁ జిత్తప్రీతిన్
భువి నిచ్చి యెల్లవారికి
శివుఁడను నే ననక యునికి శివభక్తి యగున్

462


క.

వెలుపలఁ గడిగిన లోపలఁ
గల చిత్తమలంబు వోవఁగా నేర్చునె! ని
చ్చలు భావశుద్ధిఁ గడు ని
ర్మలమతి శివుఁ గొలువవలయు మానుగ భక్తిన్.

463


క.

కత్తిఁ గొని కోసి దేహము
జొత్తిల్లఁగఁ గడిగినను విశుద్ధం బగునే!
రిత్తలు దక్కిన శుద్ధుల్
చిత్తంబున శుద్ధి వలయు శివుఁ బూజింపన్.

464


క.

ఒడలఁ గల యవయవంబులు
గడిగిన మఱి వానిలోనఁ గడు నిండిన చేఁ

  1. తేషాయమ యధా తథా
  2. మనువును