పుట:శివతత్వసారము.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నానానామాంకితులు స
దానందులు [1]సాంబరులు దిగంబరులు మహా
దానవినోదులు ప్రమథులు
నానాసురహరులు ప్రమథనాయకులు శివా!

380


క.

[2]వీరాచారాచార్యులు
వీరవ్రతవిదు లవార్యవిక్రములు మహా
వీరావతారు లసములు
వీరేశ్వర! నీగణాళి విష్ణువరేణ్యా!

381

సద్భక్తుల మహిమ

క.

స్వేచ్ఛాచారవినిష్ఠితు
లిచ్ఛావ్యాపారముక్తహృదయులు భవపా
శచ్ఛేదనకారణులు ద
యాచ్ఛాదితతనులు నీగణాధిపులు శివా!

382


క.

సర్వజ్ఞులు సర్వగతులు
సర్వశుభోదయులు సర్వసంగత్యాగుల్
సర్వపరిపూర్ణు లెప్పుడు
సర్వేశ్వర! నీగణములు శాశ్వతులు శివా!

383


క.

గతవిధినిషేధలౌకిక
గతులు మహామతులు పరమకారుణ్యలతా
కృతికరులు సకలసుగుణా
న్వితులు శివజ్ఞానరతులు నీ ప్రమథు లజా!

384
  1. సాంబవరులు?
  2. వీనాచార్యాచార్యులు