పుట:శివతత్వసారము.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కొందఱు గణపతు లత్తఱి
మందర హిమవత్ప్రధానమహితమహీభృ
త్సందోహంబులుఁ గొని కడు
నందముగా సూడుపట్టె లాడుదురు శివా!

334


క.

సుర పర్వతాది ధరణీ
ధర కందుకకేళి సలిపి తత్క్షణమున న
గ్గిరులు వొడిచేసి చల్లుచు
నరుదుగ గణపతులు గొండ ఱాడుదురు శివా!

335


క.

పూని వడి దిగిచి యష్టమ
హానాగమ్ములను [1]ముద్రియలుగా వ్రేళ్ళన్
మానుగఁ గొందఱు దాల్తురు
వాని ఫణామణుల రుచులు వఱ్ఱుగ బ్రమథుల్.

336


క.

ఆదివరాహము వెరిగిన
యా దంష్ట్రలు వెఱికి తన నిజాస్యంబున సం
పాదించికొని నటించు మ
హాదర్పముతోడ నొకగణాధిపుఁడు శివా!

337


క.

మఱి యాదికూర్మపృష్ఠము
దొఱయఁగ వడిఁ బొడిచి యందుఁ గూర్చి ఫణీంద్రున్
నెఱిఁ ద్రిప్పటముగఁ దేరిప్పుచు
వఱలఁగ గణనాథుఁ డొకఁడు వడి నాడు శివా!

338


క.

నరసింహుని కంఠంబును
నరుణజటాకేసరంబు లంబికపాదాం

  1. మిద్దియలు