పుట:శివతత్వసారము.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

శివ! నీ తోఁటల లోపల
శివగృహములలోన నొండు[1]సితమున మూత్రా
ద్యవకార్యంబులు చేసిన
యవినీతుఁడు ఘోరరౌరవాగ్నులఁ గాలున్

296


క.

ఉత్తమకులవిద్యాగుణ
విత్తోద్యోగాది సకలవిషయము లెల్లన్
రిత్తయ బుద్ధి దలంప ను
దాత్త భవద్భక్తి లేని యధములకు శివా!

297


క.

కులమునుఁ గలిమియుఁ బ్రాయము
గలిగియు మఱి ముక్కు లేని కాంతయపోలెం
గులమును గలిమియుఁ బ్రాయము
గలిగియు శివభక్తి లేని కష్టుఁడు రుద్ర్రా!

298


క.

శ్రీరమణార్చిత! దురితని
వారణ! నీభక్తి లేనివారల విద్యా
చారకులరూపసంపద
లారయఁగా నిష్ఫలంబు లన్నియు రుద్రా!

299

దక్షాధ్వరధ్వంసము

క.

సురముని వైదికమత సు
స్థిరముగ దక్షప్రజాపతి యొనర్చిన వి
స్తరసత్క్రియ దేవ! భవ
ద్విరహితముగఁ జేసి కాదె! విఫలత నొందెన్.

300


క.

వేదములు ప్రమాణములుగ
నాదిన యెడఁబడియు వాని నతకడచి భవ

  1. శితమున (చిత్తమున)