పుట:శివతత్వసారము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శివనిర్మాల్యము గుడుతురు
శివశాస్త్రపురాణవచనసిద్ధాంతగతిన్.

222


క.

ఆకునుఁ బువ్వును గాయయుఁ
బ్రాకటముగ నన్నపానభక్ష్యౌషధముల్
శ్రీకంఠున కర్పించక
చేకొనుటలు మద్యమాంససేవన గాదే!

223

శివదీక్షితుఁడు

క.

విను వేదశాస్త్రములు చది
విన మఱియు నదీక్షితునకు విహితముగాదం
ట నదీక్షితున కభక్తుని
కిని శివలింగంబు ముట్టఁ గ్రియగాదు విధిన్.

224


క.

స్వార్థపరార్థశివార్చన
మర్థిని శివదీక్షితునకు నగుఁ జేయఁగ న
త్యర్థము నిరర్థకంబు భ
యార్ధంబు నదీక్షితునకు నర్చన మెందున్.

225


క.

వెలగొని యదీక్షితుఁడు దే
వలకుండనఁ బూజచేసి వర్తించుమెయిన్
మలహరుని దీక్షితుఁడు రే
[1]వలకుండును గాఁ దెఱుంగవలయును దీనిన్.

226


క.

భవి జన్మాంతరసంస్కా
రవశంబున సహజభక్తిరతి పుట్టి శివున్

  1. వలకుఁ డెఱుంగఁగఁ జేయవలయును దీనిన్. (పూ.ము.)