Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

శ. స. 1184

(ఈశాసనము గుంటూరుమండలములోని పెద్దకాకానిగ్రామములో వేణుగోపాలస్వామియాలయము నెదుట నున్న యొకశిలాస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 700.)

శ్రీశకరాజాభిషేకసంవత్సరంబులు 1184 దుందుభిసంవ
త్సర మాఘశుద్ధదశమియు గురువారమునాండు కోటకాకాంటిని
కీర్త్తి శ్రీగోపినాథనిని మాణికము ప్రతిష్ఠ సేసి తిరుముట్ట మెత్తించి
అంగరంగభోగములు దేవునికి సమర్ప్పించె.


క.

కందం! శ్రీకీర్త్తి గోపినాథునిం
గాకాంటిపురేశుం గొలిచి కౌస్తుభరత్న
శ్రీ కనురూపము నాంగా
లోకములో మాణికము వెలుంగ్గుచు నొప్పెను.

1


క.

వినుతింప మానికమునకుం
దనయుండు గీర్త్తియన బుట్టి ధర్మ్మపరుండ్డై
వనజోదరు శ్రీకార్య్యము
నొనరంగం జేయించుచుండ్డె నుత్తమచరితను.

2

(దీనితరువాతిభాగము చాల ఖిలమైనది.)

—————

65

శ. స. 1197

(ఈశాసనము గుంటూరుమండలములో నంబూరుగ్రామమందు మల్లేశ్వరాలయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 703.)

క.

(ధర)రిసి(ని)ధిరుద్రసమితిం
(బర)గంగ భాద్రపదక్రిష్ణపంచమి గు(రువా)